G20 Presidency: భారత్‌ సరైన దేశం.. జీ-20 సదస్సు నిర్వహణపై బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌!

సరైన సమయంలో భారత్‌కు (India) జీ-20 సదస్సు (G20 summit) నిర్వహించే అవకాశం వచ్చిందని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) వ్యాఖ్యానించారు.

Published : 06 Sep 2023 19:34 IST

దిల్లీ : జీ-20 సదస్సుకు (G20 summit) ఇండియా (India) అధ్యక్షత వహించడంపై బ్రిటన్‌ (Britain) ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) స్పందించారు. జీ-20 సదస్సు నిర్వహించడానికి సరైన సమయంలో సరైన దేశానికి అవకాశం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. యూకే, భారత్‌ మధ్య ఉన్న సంబంధం వర్తమానం కంటే రెండు దేశాల భవిష్యత్తును ఎక్కువగా నిర్వచిస్తుందని చెప్పారు. ‘భారత్‌ స్థాయి, వైవిధ్యం, అసాధారణ విజయాలు జీ-20 సదస్సుకు అధ్యక్షత వహించడానికి సరైన సమయంలో సరైన దేశమని తెలుపుతున్నాయి. ఏడాది కాలంగా ప్రధాని నరేంద్రమోదీ ఈ సమావేశాలకు సమర్థవంతమైన నాయకత్వం అందించారు. భారత్ చాలా అద్భుతంగా ప్రపంచ నాయకత్వం వహించిందని’ రిషి కొనియాడారు. భారత్‌లో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit)కు సునాక్‌ రానున్నారు. ప్రధాని హోదాలో ఆయన భారత్‌కు రావడం ఇదే తొలిసారి.

‘భారత్‌’, ‘సనాతన..’పై ఆచితూచి మాట్లాడండి.. మంత్రులతో మోదీ

నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లను పరిష్కరించడానికి భారత్‌తో కలిసి పని చేస్తామని రిషి సునాక్‌ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడం మొదలు వాతావరణ మార్పులకు అడ్డుకట్ట వేయడం వరకు అన్నింటిలోనూ పాలు పంచుకుంటామన్నారు. ఈ సందర్భంగా బ్రిటన్‌ ప్రధాని ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ప్రస్తావించారు. ఆ యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం భయంకర పరిణామాలను ఎదుర్కొంటోందన్నారు. ఉక్రెయిన్‌ పౌరులు శాంతి కోరుకుంటున్నారని, కానీ.. దళాలను ఉప సంహరించి యుద్ధాన్ని ముగించే శక్తి పుతిన్‌కు మాత్రమే ఉందని రిషి వ్యాఖ్యానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని