USA: భారత్‌ ఓ మహా శక్తిగా అవతరించనుంది: అమెరికా

భారత్‌(India)-అమెరికా (USA)సంబంధాలపై శ్వేతసౌధం ఉన్నతాధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌(India) భవిష్యత్తులో గొప్ప శక్తిగా అవతరించనుందని పేర్కొన్నారు. 

Updated : 09 Dec 2022 12:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా(USA) మిత్రదేశంగానే భారత్‌(India) ఉండబోదని.. భవిష్యత్తులో మహాశక్తిగా అవతరించనుందని శ్వేతసౌధం ఆసియా సమన్వయకర్త కర్ట్‌ క్యాంప్‌బెల్‌ వ్యాఖ్యానించారు. గత 20 ఏళ్లలో అమెరికా(USA)-భారత్‌(India) సంబంధాలు బలపడిన స్థాయిలో మరే దేశంతో ద్వైపాక్షిక బంధం మెరుగుపడలేదని ఆయన అన్నారు. తన దృష్టిలో 21వ శతాబ్దంలో అమెరికా(USA)కు అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక బంధం భారత్‌(India)తోనే ఉందన్నారు. ‘ఆస్పెన్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌’ మీటింగ్‌ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు.

అమెరికా(USA) మరింత దృష్టిపెట్టి ఇరు దేశాల ప్రజల మధ్య బంధాన్ని పెంచేలా టెక్నాలజీ, ఇతర అంశాలపై కృషి చేయాలని క్యాంప్‌బెల్‌ పేర్కొన్నారు.‘‘భారత్‌(India)లో విభిన్నమైన వ్యూహాత్మక లక్షణం ఉంది. అది అమెరికా (USA)మిత్రదేశంగా ఉండబోదు.. మరో గొప్పశక్తిగా అవతరిస్తుంది. ప్రతి దశలోనూ వివిధ అంశాల్లో ఇరు దేశాల బంధం మరింత  బలపడటానికి చాలా కారణాలున్నాయి. కొంత ఆశయంతో పనిచేయాల్సిన బంధమని నేను నమ్ముతున్నాను. ఖగోళ, విద్యా, పర్యావరణ, సాంకేతిక రంగాలేవైనా.. మేము చాలా అంశాలను సమష్టిగా చేయగలిగిన కోణంలోనే చూస్తాం. అదే దిశగానే పనిచేస్తాం. గత 20ఏళ్ల బంధంలో చాలా అడ్డంకులను తొలగించుకొన్నాం. ఇందుకోసం ఇరువైపులా లోతుగా కృషి చేశాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్‌(India)-అమెరికా(USA) బంధం చైనాను ఆందోళనకు గురిచేయడానికి ఏర్పడింది కాదని క్యాంప్‌బెల్‌ పేర్కొన్నారు. ఇది సమష్టి కృషి ప్రాముఖ్యాన్ని రెండుదేశాలు లోతుగా అర్థం చేసుకోవడం వల్ల ఏర్పడిందని వెల్లడించారు. క్వాడ్‌ విషయంలో తాను సానుకూలంగా ఉన్నానని చెప్పారు. అది అనధికారిక వేదికగా మిగిలినా.. ఆ నాలుగు దేశాల మధ్య బంధం బలపడటానికి చాలా మార్గాలు ఉన్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని