Britain: లండన్‌ నగరంలో ఇంటి అద్దె.. నెలకు రూ.3 లక్షలట..!

లండన్‌(London) నగరంలో ఇంటి అద్దెలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. దాంతో ఆ అద్దెలు భరించలేక చాలామంది నగర శివార్లవైపు ఇళ్లు వెతుక్కుంటున్నారు. 

Published : 29 Jan 2023 01:15 IST

లండన్‌: ఐరోపా దేశం బ్రిటన్(Britain) ద్రవ్యోల్బణ పరిస్థితులను ఎదుర్కొంటోంది. వీటితో పాటు జీవన వ్యయాలు అధికంగా ఉన్న ఆ దేశ రాజధాని నగరం లండన్‌ (London)లో ఇంటి అద్దె(Rent)లు మరింత ఖరీదైన వ్యవహారంగా మారాయి. మూమాలుగానే భారీగా ఉండే ఈ అద్దెలు.. ఇప్పుడు మరింత ఎగబాకాయని వార్తా కథనాలు వెల్లడించాయి. అద్దె ఎక్కువగా ఉండటంతో కొందరు దీన్ని సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

లండన్‌ మహా నగరంలో ఇంటి అద్దెలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. నగరంలో లోపల రూ.3 లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో అద్దెలు పెరగడం ఇదే ప్రథమం. గత ఏడాది చివరి త్రైమాసికంలో ఆ మొత్తం రూ.2,50,000 గా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ఈ స్థాయి అద్దెలు చెల్లించలేక చాలామంది నగర శివార్లవైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. దాంతో పలు ఇళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయంది. అద్దెకు వచ్చే వ్యక్తులు ధరల్ని భరించగలిగేలా, ఎక్కువ ధరల వల్ల ఇళ్లు ఖాళీగా ఉండకుండా చూసేలా ఇంటి యజమానులు ధరలు అందుబాటులో ఉంచాలని సూచించింది. 

కాగా ప్రస్తుత పరిస్థితిని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. లండన్‌లోని ఒక బ్యాంకర్‌ డాల్‌స్టన్‌లో తన ఇంటివద్ద నిరుపయోగంగా ఉన్న రెండు పార్కింగ్ ప్లేస్‌లను ఆరేళ్ల పాటు రెంట్‌కు ఇచ్చారు. దాని కింద చేసుకున్న ఒప్పందం ద్వారా రూ.7 లక్షలు సంపాదించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని