పుతిన్‌ బర్త్‌ డే.. బెలారస్‌ అధ్యక్షుడు స్పెషల్‌ గిఫ్ట్‌‌!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌(Putin) 70వ వసంతంలోకి అడుగు పెట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఓ అరుదైన కానుక అందుకున్నారు.

Published : 08 Oct 2022 01:43 IST

సెయింట్ పీటర్స్‌బర్గ్‌: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) 70వ వసంతంలోకి అడుగు పెట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఓ అరుదైన కానుక అందుకున్నారు. తన 70వ పుట్టిన రోజు సందర్భంగా మాజీ సోవియట్‌ దేశాల నేతలు కొందరు సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని కాన్‌స్టాంటిన్‌ ప్యాలస్‌లో ఆయన్ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా రష్యా మిత్ర దేశమైన బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో పుతిన్‌కు పుట్టిన రోజు కానుకగా ఓ ట్రాక్టర్‌ని బహూకరించారు. సోవియట్ కాలం నుంచి బెలారస్‌ ట్రాక్టర్ల పరిశ్రమకు గర్వకారణంగా నిలుస్తోంది.

ట్రాక్టర్‌కు సంబంధించిన సర్టిఫికెట్‌ను పుతిన్‌కు అందజేసిన అనంతరం లుకషెంకో మీడియాతో మాట్లాడుతూ.. తన తోటలో ఉపయోగిస్తున్న మోడల్‌ ట్రాక్టర్‌నే పుతిన్‌కు కానుకగా ఇచ్చినట్టు వెల్లడించారు. అయితే, తాము అందజేసిన బహుమతి పట్ల పుతిన్‌ ఏవిధంగా స్పందించారనే విషయం మాత్రం తమకు తెలియలేదని లుకషెంకో కార్యాలయం తెలిపింది. మాజీ సోవియట్ దేశాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉగ్రవాదంపై పోరాటం, అక్రమ మాదకద్రవ్యాలు, తదితర నేరాలకు సంబంధించి సమాచారం ఇచ్చి పుచ్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడినప్పుడు పుతిన్‌ ఈ బహుమతి గురించి చెప్పకపోవడం గమనార్హం.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts