Iran: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖాతాలపై మెటా నిషేధం

ఇరాన్‌ (Iran) సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ సామాజిక మాధ్యమ ఖాతాలపై మెటా నిషేధం విధించింది. 

Updated : 09 Feb 2024 15:19 IST

 

టెహ్రాన్‌: ఇరాన్‌ (Iran) సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీ(Ayatollah Ali Khamenei)పై టెక్‌ దిగ్గజం మెటా కఠిన చర్యలు తీసుకుంది. ఆయన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగించింది. తమ కంటెంట్‌ విధానాలను పదేపదే ఉల్లంఘించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఇజ్రాయెల్‌(Israel)పై హమాస్ మిలిటెంట్లు ఉగ్రదాడి జరిపిన దగ్గరి నుంచి ఈ సుప్రీం లీడర్‌పై నిషేధం విధించాలంటూ మెటాపై ఒత్తిడి వచ్చింది. హమాస్‌ జరిపిన విధ్వంసానికి ఖమేనీ మద్దతు ఇవ్వడమే గాకుండా.. గాజాలో ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మిలిటెంట్ల చర్యలను, ఎర్రసముద్రంలో నౌకలపై హూతీల దాడులను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి వెనక మాత్రం తమ పాత్ర లేదని వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఖాతాలపై నిషేధం విధించిన మెటా.. ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం ప్రస్తావన మాత్రం తీసుకురాలేదు. (Israel-Hamas war)

30 ఏళ్లకు పైగా ఇరాన్‌లో అధికారంలో ఉన్న ఖమేనీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇరాన్‌లో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌పై ఆంక్షలు ఉన్నాయి. అక్కడి ప్రజలు వర్చువల్‌ ప్రైవేటు నెట్‌వర్క్స్‌ ద్వారా ఈ మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని