Helicopters Crash: కుప్పకూలిన బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు: 9మంది అమెరికా సైనికుల దుర్మరణం

 అమెరికా సైన్యం (US Army)లో 101 ఎయిర్‌బోర్న్‌ డివిజన్‌ (101st Airborne Division)కు చెందిన రెండు హెచ్‌హెచ్‌60 బ్లాక్‌హాక్‌ ((Black Hawk)) హెలికాప్టర్ల (Helicopters)లో సైనికులు శిక్షణ పొందుతుండగా ఆకస్మాత్తుగా కుప్పకూలాయి. 

Updated : 30 Mar 2023 21:34 IST

వాషింగ్టన్‌: అమెరికాలో ఘోర ప్రమాదం చేసుకుంది. యూఎస్‌ ఆర్మీ (US Army)కి చెందిన రెండు బ్లాక్‌హాక్‌ (Black Hawk) హెలికాప్టర్లు (Helicopter) కెంటకీ (Kentucky) రాష్ట్రంలోని ట్రిగ్గ్ కౌంటీ (Trigg count)లో ఫోర్ట్‌ క్యాంప్‌బెల్‌ (Fort Campbell) ప్రాంతంలో కుప్పకూలాయి. ఈ ఘటనలో 9 మంది అమెరికన్‌ సైనికులు (US Soldiers) దుర్మరణం చెందారు. శిక్షణలో భాగంగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని లెఫ్టినెంట్ కర్నల్‌ ఆంటోని హోఫ్లర్‌ వెల్లడించారు. స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. 

అమెరికా సైన్యంలో 101ఎయిర్‌బోర్న్‌ డివిజన్‌కు చెందిన రెండు హెచ్‌హెచ్‌60 బ్లాక్‌ హెలికాప్టర్లలో సైనికులు శిక్షణ పొందుతుండగా ఆకస్మాత్తుగా కుప్పకూలినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ప్రమాద ఘటనపై కెంటకీ గవర్నర్‌ ఆండీ బేషియర్‌ ట్వీట్ చేశారు. పోలీసులు, సహాయ సిబ్బందికి ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన సైనికుల కుటుంబాల కోసం ప్రార్థించాలని విజ్ఞప్తి చేశారు. ఫోర్ట్‌ క్యాంప్‌బెల్‌లో అమెరికన్‌ సైన్యానికి చెందిన 101 ఎయిర్‌బోర్న్‌ డివిజన్‌ బేస్‌ క్యాంప్‌ ఉంది. 1942 ఆగస్టులో ఈ డివిజన్‌ను అమెరికన్‌ సైన్యం ఏర్పాటు చేసింది. దీన్ని స్క్రీమింగ్ ఈగల్స్‌ అని కూడా పిలుస్తారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో డీ-డే ల్యాండిగ్స్‌, బ్యాటిల్‌ ఆఫ్‌ ది బల్గేగా ఈ డివిజన్‌ను పిలిచేవారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని