US Corona: డెల్టా కంటే ఒమిక్రాన్‌తోనే ఎక్కువ మరణాలు..!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఒమిక్రాన్ వేవ్ అదుపులోకి వస్తోంది. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ..

Published : 22 Feb 2022 21:58 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఒమిక్రాన్ వేవ్ అదుపులోకి వస్తోంది. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే అక్కడ డెల్టా వేవ్ కంటే ఒమిక్రాన్‌ వేవ్ కారణంగానే ఎక్కువ కరోనా మరణాలు సంభవించాయట. ఈ మేరకు సియాటిల్ టైమ్స్ నివేదించింది. 

గత ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరించింది. వ్యాప్తిలో వేగంగా ఉన్నప్పటికీ.. వ్యాధి లక్షణాలు కాస్త స్వల్పంగానే ఉన్నాయని వైద్య నిపుణులు వెల్లడించారు. కాగా, ఈ కొత్త వేరియంట్ కారణంగా అమెరికాలో 3 కోట్లకు పైగా కొత్త కేసులు, 1.5 లక్షల మరణాలు సంభవించాయని పేర్కొంది. అదేవిధంగా గత ఏడాది ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు డెల్టా వేరియంట్ తీవ్రంగా విజృంభించిన సమయంలో..  కోటికి పైగా కేసులు, 1.3 లక్షల మరణాలు సంభవించాయని వెల్లడించింది. వేరియంట్లు వ్యాప్తి చెందిన వ్యవధి ఒకటే అయినా.. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌తో 17 శాతం అధికంగా మరణాలు నమోదయ్యాయని తెలిపింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని