Rishi Sunak: డౌనింగ్ స్ట్రీట్ బయట లాక్‌ అయిన సునాక్‌..!

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak), నెదర్లాండ్స్ ప్రధానితో కలిసి తన ఇంట్లోకి వెళ్లలేకపోయారు. వారిద్దరు కొద్దిసేపు బయటే ఉండిపోవాల్సి వచ్చింది. 

Published : 09 Dec 2023 17:47 IST

లండన్‌: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌(Rishi Sunak) తన అధికారిక నివాసం వద్ద కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. నెదర్లాండ్స్‌ ప్రధాని మార్కె రుటెను ఆహ్వానించేందుకు ఇంటి బయటకు వచ్చిన ఆయన కొద్దిసేపు లాక్‌ అయ్యారు. రుటెకు వెల్‌కమ్ చెప్పిన తర్వాత 10 డౌనింగ్‌ స్ట్రీట్ లోపలికి వెళ్దామనుకుంటే డోర్‌ తెరుచుకోలేదు. దాంతో వారు గందరగోళానికి గురయ్యారు. 

రుటె కోసం సునాక్(Rishi Sunak) బయటకు రాగానే.. డౌనింగ్ స్ట్రీట్( Downing Street) బ్లాక్‌ డోర్‌ వెంటనే మూసుకుంది. దానిని గమనించని నేతలు అక్కడి మెట్ల వద్దే ఒకరినొకరు పలకరించుకున్నారు. తర్వాత లోపలికి వెళ్దామని చూడగా.. డోర్‌ తెరుచుకోలేదు. అప్పటికీ వారు మాట్లాడుకుంటూనే డోర్‌ ఎందుకు రావడం లేదా..? అని అటూ ఇటూ కొద్దిసేపు తచ్చాడారు. ఇంకోవైపు, ఫొటోగ్రాఫర్లు టకటక ఫొటోలు తీసేశారు. మధ్యలో సునాక్‌ తలుపు నెట్టినా ఫలితం లేకపోయింది. అయితే కొద్దిసేపటి తర్వాత లోపల ఉన్న వ్యక్తి డోర్ తెరవగా.. ఇద్దరు కలిసి లోపలికి వెళ్లిపోయారు. సిబ్బంది ఒకరు పొరపాటున డోర్ పెట్టడంతో ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. 

రెండు దశాబ్దాలుగా ‘ఒకేఒక్కడు’.. ఐదోసారి అధికారానికి ‘సై’!

రెండురోజుల క్రితంనాటి దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇక ఈ ఇద్దరు నేతల మధ్య భౌగోళిక రాజకీయ అంశాలు, ఇజ్రాయెల్‌-హమాస్‌ ఘర్షణ వంటి పలు అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని