Ukraine Crisis: మేరియుపోల్‌ దక్షిణ భాగం రష్యా చేతికి..!

ఉక్రెయిన్‌లోని పోర్టుసిటీ  మేరియుపోల్‌ దక్షిణ భాగంలో అత్యధిక మొత్తం రష్యన్లు ఆక్రమించుకొన్నారు. ఈ విషయాన్ని బ్రిటన్‌ రక్షణ మంత్రి శాఖ రోజు

Published : 28 Mar 2022 18:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌లోని పోర్టుసిటీ  మేరియుపోల్‌ దక్షిణ భాగంలో అత్యధిక మొత్తం రష్యన్లు ఆక్రమించుకొన్నారు. ఈ విషయాన్ని బ్రిటన్‌ రక్షణ మంత్రి శాఖ రోజు వారీ విశ్లేషణ కూడా ధ్రువీకరించింది. ‘‘మేరియుపోల్‌లోని దక్షిణ ప్రాంతమే రష్యన్ల చేతిలో ఉంది. మిగిలిన భాగంలో హోరాహోరీ పోరు కొనసాగుతోంది. రష్యన్ల తీరులో ఎటువంటి మార్పులేదు’’ అని ఆ నివేదికలో పేర్కొంది. కాకపోతే రష్యా దళాలకు అవసరమైన సరఫరాలు మాత్రం సరిపడా అందకపోవడంతో.. వేగంగా ముందుకు కదలడంలేదని ఆ నివేదిక విశ్లేషించింది. 

అంతకు ముందు ఆదివారం నాడు బెర్డెయాన్స్క్‌ నౌకాశ్రయం వద్ద అజోవ్‌ సముద్రంలో రష్యా నౌకపై దాడి చేయడంతో ఆ దళాలు వేగంగా ముందుకు కదలడంలేదని పేర్కొంది. ఈ ప్రదేశం మేరియుపోల్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దాడికి ఉక్రెయిన్‌ దళాలు బాధ్యత స్వీకరించాయి. అమెరికా రక్షణ రంగ నిపుణుడు హెచ్‌ఐ సట్టన్‌ ఇది రష్యాకు పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణించారు. కానీ, వ్యూహాత్మక పరిస్థితిలో ఎటువంటి మార్పుఉండబోదని పేర్కొన్నారు. అజోవ్‌ సముద్రంలో, బ్లాక్‌సీలో ఉక్రెయిన్‌ సరఫరాలను రష్యా సమర్థంగా అడ్డుకొంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని