ఒకే కుటుంబం చేతుల్లో తెలంగాణ బందీగా ఉంది: ప్రవీణ్ కుమార్

ఎంతో మంది ప్రాణత్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ.. ఒకే కుటుంబం చేతులో ఆర్థిక, రాజకీయ, సామాజికంగా బందీ అయ్యిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీఎస్పీ కార్యాలయంలో.. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. నీళ్లు, నిధులు, నియమాల ఆకాంక్షతో ఏర్పడిన రాష్ట్రంలో.. నీళ్లు కన్నీళ్లుగా, నిధులు గుప్తా నిధులుగా, నియమాలు అగట్లో సరుకుగా మరిపోయాయని ఆరోపించారు. ఈ నెల 11న జరిగే గ్రూపు-1 పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్  చేశారు.

Updated : 02 Jun 2023 17:13 IST

మరిన్ని