Hyderabad: మేడ్చల్‌ మార్గంలో రోడ్డు కోత.. కొంపల్లి నుంచి దూలపల్లి దారిలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

నగరంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మేడ్చల్‌ మార్గంలో రోడ్డు కోతకు గురైంది. కొంపల్లి నుంచి దూలపల్లి వెళ్లే దారిలో రోడ్డు కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపైకి రావడంతో కొంపల్లి నుంచి మేడ్చల్‌ వెళ్లే మార్గంలో సుచిత్ర వద్ద ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సుమారు 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ప్రత్యా్మ్నాయ మార్గాల్లో వాహనాలను పంపించారు. 

Published : 13 Oct 2022 14:11 IST

Tags :

మరిన్ని