TDP: కొవ్వూరు తెదేపాలో భగ్గుమన్న వర్గ పోరు.. గోరంట్ల బుచ్చయ్య ఆగ్రహం

కొవ్వూరు పట్టణం: డిసెంబర్‌ 1న తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం రసాభాసగా మారింది. ద్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో సభ ప్రారంభించగా ముఖ్య అతిథిగా తెదేపా పోలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కేఎస్‌ జవహర్‌ ఆయన వర్గంతో సభ వద్దకు రాగా.. ఆయన్ను వేదికపైకి పిలిచే విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. అనుకూల, వ్యతిరేక వర్గాలుగా ఘర్షణ పడ్డారు. బుచ్చయ్య చౌదరి ఎంత సర్దిచెప్పినా కార్యకర్తలు ఆయన మాట వినలేదు. చివరికి ద్విసభ్య కమిటీ సభ్యులో బుచ్చయ్య చౌదరి పక్కనే ఉన్న గదిలో చర్చించారు. అనంతరం బయటకు వచ్చి పార్టీలో వర్గ విభేదాలు వీడాలని, పార్టీ కొవ్వూరు అభ్యర్థిని చంద్రబాబు ప్రకటిస్తారని, సీటు ఎవరికిచ్చినా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సమావేశం నుంచి బుచ్చయ్య చౌదరి బయటకు వెళ్తుండగా అక్కడే ఉన్న జవహర్‌ తనను అక్కడే నిల్చొబెట్టారని అడిగారు. దీంతో జవహర్‌ వర్గం.. దళితుడనే అలా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. అనంతరం బుచ్చయ్య చౌదరి బయటకు వెళ్లారు.

Updated : 26 Nov 2022 18:51 IST

Tags :

మరిన్ని