YSRCP: ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి నిరసన సెగ

ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దండువారిపల్లి గ్రామంలో.. ఎమ్మెల్యే పర్యటనను గ్రామస్థులను అడ్డుకున్నారు. ఎన్నికల హామీలపై నిలదీశారు. శ్మశానవాటికతో పాటు ఇంటింటికీ తాగునీరు అందిస్తామని చెప్పి నాలుగేళ్లైనా.. ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. త్వరలోనే సమస్యల్నీ పరిష్కరిస్తాని చెప్పి.. ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Published : 31 May 2023 21:14 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు