No Bag Day: బడి పిల్లల బాల్యంపై బ్యాగుల భారం?

బాల్యంపై బడి బ్యాగుల భారం పడుతోంది. భావి భారత పౌరులు కాస్తా బరువు బాధితులుగా మారుతున్నారు. పాఠశాల పుస్తకాల బరువును మోయలేక కుంగిపోతున్నారు. బరువు ఎక్కువవుతుందని తల్లిదండ్రులు చెబుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. చిన్నారులు విద్యార్థి దశ నుంచే కండరాల బలహీనత, వెన్ను నొప్పి బారిన పడుతున్నారు. బడి నుంచి సాయంత్రం ఇంటికొచ్చే సమయానికే నీరసపడిపోతున్నారు. పుస్తకాల బరువు తగ్గించాలని, నో బ్యాగ్ డే అమలు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చినా కాగితాలకే పరిమితమయ్యాయి. ఓవైపు డిజిటల్ క్లాస్ లు అంటూ చెప్పుకుంటున్న పాఠశాలలు పిల్లల చేత మాత్రం బండెడు పుస్తకాలు మోపిస్తున్నాయి. మరి, ఈ తప్పెవరిది...? అసలు, పిల్లలు ఎంత బరువు మోయాలి...? ఇప్పడు చూద్దాం..

Published : 22 Dec 2023 23:26 IST

Tags :

మరిన్ని