Araku: అరకులో ప్రధాన పార్టీల హోరాహోరీ పోరు

దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గాలలో అరకు ఒకటి. ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా అకళింపు చేసుకోవడం, రాజకీయ స్థితిగతులను అంచనా వేయడం అందుకు తగిన వ్యూహాలను రచించుకోవడం రాజకీయపక్షాలకు పెద్ద సవాల్.

Published : 27 Apr 2024 19:23 IST

దేశంలోనే అతి పెద్ద పార్లమెంట్ నియోజకవర్గాలలో అరకు ఒకటి. ఓ వైపు నుంచి మరో వైపునకి వెళ్లాలంటే దాదాపు 7 వందల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. రెండు జిల్లాలలో విస్తరించి ఉన్నప్పటికీ, సుమారు నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న నియోజకవర్గం ఇది. కటాఫ్ ప్రాంతాలు, రాష్ట్రాల సరిహద్దు సమస్యలు ఈ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం. 70 శాతం గిరిజనులు ఇతర గిరిజనేతర తెగలు ఉన్న ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా అకళింపు చేసుకోవడం, రాజకీయ స్థితిగతులను అంచనా వేయడం అందుకు తగిన వ్యూహాలను రచించుకోవడం రాజకీయపక్షాలకు పెద్ద సవాల్.

Tags :

మరిన్ని