Tanzania: టాంజానియాలో భారీ వర్షాలు.. 150 మందికి పైగా మృతి

తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియాలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 150కి పైగా పెరిగిందని, వందల మంది గాయపడ్డట్లు ఆ దేశ ప్రధాని ఖాసిమ్ మజలివా తెలిపారు.

Updated : 27 Apr 2024 17:17 IST

తూర్పు ఆఫ్రికా దేశం టాంజానియా (Tanzania)లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మరణించినవారి సంఖ్య 150కి పైగా పెరిగిందని, వందల మంది గాయపడ్డట్లు ఆ దేశ ప్రధాని ఖాసిమ్ మజలివా తెలిపారు. భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లోని మౌలిక వసతులు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఆ దేశ రాజధానిలో రహదారులు వరద నీటితో నిండి నదులను తలపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 14  ప్రావిన్సుల్లో సుమారు 2 లక్షల మంది వరద ప్రభావానికి గురైనట్లు టాంజానియా అధికారులు తెలిపారు. 

Tags :

మరిన్ని