కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌కు.. 14 ఏళ్ల క్రితం ఇదే తరహా ప్రమాదం!

ఒడిశా బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం 2009 నాటి దుర్ఘటనను గుర్తు చేస్తోంది. 14 ఏళ్ల క్రితం ఇదే కోరమండల్ ఎక్స్ ప్రెస్ (Coromandel Express) అప్పుడు కూడా ప్రమాదానికి గురైంది. సరిగ్గా శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలోనే ఆ దుర్ఘటన కూడా జరిగింది. 2009 ఫిబ్రవరి 13న ఇదే కోరమండల్ ఎక్స్ ప్రెస్ అత్యంత వేగంతో జైపుర్ రోడ్ రైల్వేస్టేషన్ దాటుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్ మార్చుకుంటున్న సమయంలో పట్టాలు తప్పి బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంజిన్ మరో ట్రాక్ మీద పడిపోయింది. ఆ ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. చాలా మందికి గాయాలయ్యాయి.

Published : 03 Jun 2023 15:43 IST

మరిన్ని