Musharraf: కార్గిల్‌ విలన్‌, పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌ కన్నుమూత

పాకిస్థాన్‌ మాజీ సైనిక పాలకుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అమైలాయిడోసిస్‌ అనే రుగ్మతతో బాధపడుతున్న ఆయన.. దుబాయిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అధ్యక్షుడిగా ఎనిమిదేళ్ల పాటు.. పాకిస్థాన్‌లో నియంత పాలన సాగించిన ముషారఫ్‌ అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. భారత్‌, పాక్‌ మధ్య కార్గిల్‌ యుద్ధానికి కుట్రలు పన్నడం నుంచి.. మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో హత్య వరకు పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారు. పదవీ కాంక్షతో ఏకంగా రాజ్యంగాన్నే రద్దు చేసి అత్యవసర స్థితిని విధించారు. చివరకు దుబాయ్‌ పారిపోయి అక్కడే కన్నుమూశారు.

Published : 05 Feb 2023 18:38 IST

Tags :

మరిన్ని