Tamilnadu: ఎద్దుల పోటీకి అనుమతి నిరాకరణ.. పోలీసులపై యువకుల రాళ్ల దాడి

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా గోబసందిరంలో ఎద్దుల పోటీకి అనుమతి నిరాకరించడంతో.. వందలాది మంది యువకులు చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. గోబసందిరంలో ఎద్దుల పోటీలు జరుగుతున్నట్లు ప్రచారం జరగటంతో..  ఉదయాన్నే పెద్ద సంఖ్యలో యువకులు అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఎద్దుల పోటీలను అడ్డుకున్నారు. ఆగ్రహించిన యువకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆందోళనకారులను ఆపే ప్రయత్నం చేయగా... రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కలెక్టర్ నచ్చజెప్పిన వినకపోవడంతో.. పోలీసులు భాష్ప వాయువు, నీటి ఫిరంగులను ఉపయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. 

Published : 02 Feb 2023 19:14 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు