AP News: పింఛన్ల పంపిణీపై మారని ప్రభుత్వ యంత్రాంగం తీరు

అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఈసీ వేటు వేసినా.. ఇంకా చాలామందిలో మార్పు రాలేదు. ఎన్నికల్లో వైకాపాకు (YSRCP) ఎంత వీలైతే అంత మేలు చేయాలన్న ఆలోచనా ధోరణిలోనే వారున్నట్లు కనిపిస్తోంది.

Published : 27 Apr 2024 09:24 IST

అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఈసీ వేటు వేసినా.. ఇంకా చాలామందిలో మార్పు రాలేదు. ఎన్నికల్లో వైకాపాకు (YSRCP) ఎంత వీలైతే అంత మేలు చేయాలన్న ఆలోచనా ధోరణిలోనే వారున్నట్లు కనిపిస్తోంది. పింఛన్ల పంపిణీలో సీఎస్‌తో పాటు ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. కేవలం వాలంటీర్లతో ఇంటింటికీ పింఛన్ల పంపిణీ వద్దని ఈసీ చెబితే దానికి వక్రభాష్యాలు చెప్పి ఏప్రిల్ నెలలో వృద్ధులను గ్రామ, వార్డు సచివాలయాలకు వద్దకు రప్పించారు. ఎండలకు తాళలేక 32 మంది మరణించారు. ఇంత జరిగినా మే నెలలో పింఛన్ల పంపిణీకి మరో నాలుగు రోజులే ఉన్నా సీఎస్ దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

మరిన్ని