Warangal: 5 నిమిషాల్లోనే రోడ్డున పడ్డాం.. కనికరించండి..!

వరంగల్‌లో శనివారం రాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించింది. ఇంటి పైకప్పులు ఎగిరిపోయి.. చెట్లు నేలకూలాయి. ఫలితంగా రెక్కాడితే గానీ డొక్కాడని వీరికి రాత్రంతా కంటిమీద కునుకే కరవైంది. స్తంభాలు వంగిపోవడంతో పాటు తీగలపై రేకులు పడడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. నగరంలోని కాశీబుగ్గ, చింతల్, జేబీనగర్, ఆర్‌ఎస్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో.. దాదాపు 150కి పైగా కుటుంబాలను గాలి దుమారం నిలువనీడ లేకుండా చేసింది. వీరిలో చాలా మంది ఇటీవల కంటి ఆపరేషన్‌లు చేయించుకున్న వారే. తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని.. ప్రభుత్వం దయతలచి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Updated : 21 May 2023 18:40 IST

Tags :

మరిన్ని