బ్రేకింగ్

breaking
06 Jul 2022 | 17:58 IST

కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌కు కాలపరిమితి తగ్గింపు

దిల్లీ: కొవిడ్‌ బూస్టర్‌ డోస్‌ గ్యాప్‌ను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఇకపై 18-59 ఏళ్ల మధ్య ఉన్నవారికి రెండో డోస్‌ తీసుకున్న 6 నెలల తర్వాత బూస్టర్‌ డోస్‌ తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లేఖ రాశారు. గతంలో 2 డోసులు పూర్తయిన 9 నెలల తర్వాత బూస్టర్‌ డోస్‌కు అనుమతి ఉన్న సంగతి తెలిసిందే.

మరిన్ని

తాజా వార్తలు