News in Pics: చిత్రం చెప్పే సంగతులు-02(09-02-2023)

Updated : 09 Feb 2023 21:56 IST
1/28
రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్‌సీ15’(వర్కింగ్‌ టైటిల్). ఈ సినిమా షూటింగ్‌ను గురువారం చార్మినార్‌ వద్ద నిర్వహించారు. సంబంధిత ఫొటోను శంకర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్‌సీ15’(వర్కింగ్‌ టైటిల్). ఈ సినిమా షూటింగ్‌ను గురువారం చార్మినార్‌ వద్ద నిర్వహించారు. సంబంధిత ఫొటోను శంకర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.
2/28
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా.. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా.. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
3/28
హైదరాబాద్‌లోని లుంబినీ పార్కులో గురువారం సాయంత్రం మ్యూజికల్ ఫౌంటేన్ ప్రారంభించారు. ఈ ఫౌంటేన్‌ ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. హైదరాబాద్‌లోని లుంబినీ పార్కులో గురువారం సాయంత్రం మ్యూజికల్ ఫౌంటేన్ ప్రారంభించారు. ఈ ఫౌంటేన్‌ ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.
4/28
5/28
ట్రాఫిక్‌ సిగ్నళ్లలో ఎరుపు లైటు పడిందనుకుంటున్నారా. అదేం లేదండి.. ఏలూరు జూట్‌ మిల్లు కూడలిలోని ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైట్ల చెంత సాయంత్రం 5.30గంటలకు అస్తమిస్తున్న సూర్యుడు ఇలా కనువిందు చేశాడు. ట్రాఫిక్‌ సిగ్నళ్లలో ఎరుపు లైటు పడిందనుకుంటున్నారా. అదేం లేదండి.. ఏలూరు జూట్‌ మిల్లు కూడలిలోని ట్రాఫిక్‌ సిగ్నల్‌ లైట్ల చెంత సాయంత్రం 5.30గంటలకు అస్తమిస్తున్న సూర్యుడు ఇలా కనువిందు చేశాడు.
6/28
అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను కలవడానికి వచ్చిన ప్రజలు హైదరాబాద్‌లోని అసెంబ్లీ చుట్టుపక్కల ఇలా రోడ్లపై కూర్చొని కనిపించారు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను కలవడానికి వచ్చిన ప్రజలు హైదరాబాద్‌లోని అసెంబ్లీ చుట్టుపక్కల ఇలా రోడ్లపై కూర్చొని కనిపించారు.
7/28
అసెంబ్లీ సమావేశాలు చూడటానికి విద్యార్థినులు అసెంబ్లీ సమావేశాలు చూడటానికి విద్యార్థినులు
8/28
తెలంగాణ-మహారాష్ర్ట సరిహద్దు ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలోని ప్రధాన అంతర్రాష్ర్ట రహదారి ఇలా గుంతలమయంగా మారింది. సుమారు 35 కిలోమీటర్లు మేర రోడ్డు అధ్వానంగా తయారైంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.. తెలంగాణ-మహారాష్ర్ట సరిహద్దు ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలంలోని ప్రధాన అంతర్రాష్ర్ట రహదారి ఇలా గుంతలమయంగా మారింది. సుమారు 35 కిలోమీటర్లు మేర రోడ్డు అధ్వానంగా తయారైంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు..
9/28
విజయ్‌ ఆంటోని హీరోగా.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘బిచ్చగాడు 2’. ఈ సినిమా ‘స్నీక్‌ పీక్‌ ట్రైలర్‌’ను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. గతంలో ఘన విజయం సాధించిన ‘బిచ్చగాడు’కు కొనసాగింపుగా ఈ సినిమా వస్తోంది. విజయ్‌ ఆంటోని హీరోగా.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘బిచ్చగాడు 2’. ఈ సినిమా ‘స్నీక్‌ పీక్‌ ట్రైలర్‌’ను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. గతంలో ఘన విజయం సాధించిన ‘బిచ్చగాడు’కు కొనసాగింపుగా ఈ సినిమా వస్తోంది.
10/28
చేతికొచ్చిన పంటను విక్రయించేంత వరకు అన్నదాతకు అవస్థలు తప్పడంలేదు. ఆదిలాబాద్‌ జిల్లా లిమ్‌గూడలోని ఓ రైతు గిట్టుబాటు ధరలు లేక పత్తిని ఇంటి నిండా నిల్వ చేసుకున్నారు. దీంతో ఇంట్లో చోటులేక రాత్రిళ్లు ఆరుబయట నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో పత్తి సాగు చేస్తున్న  రైతులందరిది పరిస్థితి ఇలాగే ఉంది.. చేతికొచ్చిన పంటను విక్రయించేంత వరకు అన్నదాతకు అవస్థలు తప్పడంలేదు. ఆదిలాబాద్‌ జిల్లా లిమ్‌గూడలోని ఓ రైతు గిట్టుబాటు ధరలు లేక పత్తిని ఇంటి నిండా నిల్వ చేసుకున్నారు. దీంతో ఇంట్లో చోటులేక రాత్రిళ్లు ఆరుబయట నిద్రపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో పత్తి సాగు చేస్తున్న రైతులందరిది పరిస్థితి ఇలాగే ఉంది..
11/28
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ‘ది ఫోర్స్‌ ఆఫ్‌ ఫిమేల్‌ ఫోర్టిట్యూడ్‌’ పేరుతో చర్చావేదిక నిర్వహించారు. కార్యక్రమంలో ఫరా ఖాన్, పింకీరెడ్డి, శుభ్ర మహేశ్వరీ, సినీనటులు అడివి శేషు, పూజా హెగ్డే పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ‘ది ఫోర్స్‌ ఆఫ్‌ ఫిమేల్‌ ఫోర్టిట్యూడ్‌’ పేరుతో చర్చావేదిక నిర్వహించారు. కార్యక్రమంలో ఫరా ఖాన్, పింకీరెడ్డి, శుభ్ర మహేశ్వరీ, సినీనటులు అడివి శేషు, పూజా హెగ్డే పాల్గొన్నారు.
12/28
13/28
గుణదలలోని విజయవాడ కధోలిక గురు పీఠంలో ‘గుణదల మాత మహోత్సవం-2023’ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దఎత్తున క్రైస్తవులు తరలివచ్చి ప్రార్థనలు చేశారు. గుణదలలోని విజయవాడ కధోలిక గురు పీఠంలో ‘గుణదల మాత మహోత్సవం-2023’ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పెద్దఎత్తున క్రైస్తవులు తరలివచ్చి ప్రార్థనలు చేశారు.
14/28
కల్యాణ్‌ రామ్‌, ఆషికా రంగనాథ్‌ జంటగా రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమిగోస్‌’. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం నిర్వహించిన  ప్రీరిలీజ్‌ ప్రెస్‌ మీట్‌లో కల్యాణ్‌రామ్‌, ఆషికా ఇలా మెరిశారు. కల్యాణ్‌ రామ్‌, ఆషికా రంగనాథ్‌ జంటగా రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమిగోస్‌’. ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం నిర్వహించిన ప్రీరిలీజ్‌ ప్రెస్‌ మీట్‌లో కల్యాణ్‌రామ్‌, ఆషికా ఇలా మెరిశారు.
15/28
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్‌ వాహనాల ఎగ్జిబిషన్‌లో ‘మహీంద్ర పినిన్‌ఫర్నియా బట్టిస్టా’ కారును మహీంద్ర సంస్థ యూరోప్‌ బిజినెస్‌ సీఈవో గురుప్రతాప్‌ బొపరాయి ఆవిష్కరించారు. ఈ కారు వినూత్న డిజైన్‌తో, అధునాతన హంగులతో సందర్శకుల దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్‌ వాహనాల ఎగ్జిబిషన్‌లో ‘మహీంద్ర పినిన్‌ఫర్నియా బట్టిస్టా’ కారును మహీంద్ర సంస్థ యూరోప్‌ బిజినెస్‌ సీఈవో గురుప్రతాప్‌ బొపరాయి ఆవిష్కరించారు. ఈ కారు వినూత్న డిజైన్‌తో, అధునాతన హంగులతో సందర్శకుల దృష్టిని ఆకర్షించింది.
16/28
17/28
విశాఖలోని అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి రైల్వే స్టేషన్‌ మార్గంలో అల్లిపురం వద్ద ప్రహరీలను జీవీఎంసీ ఆధ్వర్యంలో రంగు రంగుల చిత్రాలతో అందంగా అలంకరించారు. ఇవి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. విశాఖలోని అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి రైల్వే స్టేషన్‌ మార్గంలో అల్లిపురం వద్ద ప్రహరీలను జీవీఎంసీ ఆధ్వర్యంలో రంగు రంగుల చిత్రాలతో అందంగా అలంకరించారు. ఇవి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
18/28
తుర్కియే, సిరియాల్లో భూకంప మరణాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి.  దక్షిణ తుర్కియేలో రెండు రోజుల నుంచి శిథిలాల కింద సజీవంగా ఉన్న ఓ పసికందును సహాయక సిబ్బంది కాపాడారు. తుర్కియే, సిరియాల్లో భూకంప మరణాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. పెద్ద పెద్ద భవనాలు నేలకూలాయి. దక్షిణ తుర్కియేలో రెండు రోజుల నుంచి శిథిలాల కింద సజీవంగా ఉన్న ఓ పసికందును సహాయక సిబ్బంది కాపాడారు.
19/28
దర్శకుడు దశరథ్‌ తాను రాసిన ‘కథారచన’ పుస్తకాన్ని ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్‌కు కానుకగా అందజేశారు. దర్శకుడు దశరథ్‌ తాను రాసిన ‘కథారచన’ పుస్తకాన్ని ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్‌కు కానుకగా అందజేశారు.
20/28
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలోని సంసిరెడ్డిపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకూరులోని ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలోని సంసిరెడ్డిపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకూరులోని ముత్యాలమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు..
21/28
ప్రముఖ నటుడు మహేశ్‌బాబు, నమ్రత దంపతులు హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో కనిపించి సందడి చేశారు. ప్రముఖ నటుడు మహేశ్‌బాబు, నమ్రత దంపతులు హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో కనిపించి సందడి చేశారు.
22/28
23/28
తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్‌ (KS Bharat) టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టీమ్‌ఇండియా (Team India) తరఫున ఆసీస్‌తో బోర్డర్‌ - గావస్కర్ (Border - Gavaskar) ట్రోఫీ తొలి టెస్టులో స్థానం దక్కింది. మ్యాచ్‌ మొదటి రోజు ఆట మొదలుపెట్టే ముందు ఆయన తన తల్లిని ఆలింగనం చేసుకున్నాడు. తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్‌ (KS Bharat) టెస్టు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. టీమ్‌ఇండియా (Team India) తరఫున ఆసీస్‌తో బోర్డర్‌ - గావస్కర్ (Border - Gavaskar) ట్రోఫీ తొలి టెస్టులో స్థానం దక్కింది. మ్యాచ్‌ మొదటి రోజు ఆట మొదలుపెట్టే ముందు ఆయన తన తల్లిని ఆలింగనం చేసుకున్నాడు.
24/28
ఆదాయార్జనశాఖలతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 
ఆదాయార్జనశాఖలతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
25/28
హీరో ధనుష్‌,  సంయుక్తా మేనన్‌లు (Samyuktha Menon) జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘సార్‌’ (SIR). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విడుదలైన చిత్ర ట్రైలర్‌.. 18 గంటల వ్యవధిలోనే మిలియన్ల వ్యూస్‌ సంపాదించింది. ప్రస్తుతం ‘సార్‌’ ట్రైలర్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ 01గా నిలిచింది. సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో ధనుష్‌, సంయుక్తా మేనన్‌లు (Samyuktha Menon) జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘సార్‌’ (SIR). సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విడుదలైన చిత్ర ట్రైలర్‌.. 18 గంటల వ్యవధిలోనే మిలియన్ల వ్యూస్‌ సంపాదించింది. ప్రస్తుతం ‘సార్‌’ ట్రైలర్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ 01గా నిలిచింది. సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.
26/28
రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు.. ఆస్ట్రేలియాతో (Australia) నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడుతోంది. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar) తొలి టెస్టుకు నాగ్‌పూర్‌ వేదికగా మారింది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు.. ఆస్ట్రేలియాతో (Australia) నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడుతోంది. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar) తొలి టెస్టుకు నాగ్‌పూర్‌ వేదికగా మారింది.
27/28
శుక్రవారం చేపట్టనున్న రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో అధిపతి డా. సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం చేపట్టనున్న రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో అధిపతి డా. సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
28/28
తుర్కియే, సిరియాల్లో భూకంప మరణాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు నేలకూలాయి. ఆ భవన శిథిలాల కింద ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. తుర్కియే, సిరియాల్లో భూకంప మరణాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు నేలకూలాయి. ఆ భవన శిథిలాల కింద ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిశాయి.

మరిన్ని