News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (24-03-2023)

Updated : 24 Mar 2023 12:26 IST
1/18
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ గడ్డిఅన్నారం చౌరస్తా వద్ద రోడ్డు దాటాలంటే పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.. కోణార్క్‌ చౌరస్తాలో సిగ్నల్‌ పడగానే వేగంగా దూసుకొచ్చే వాహనాలు ఓ వైపు ఉంటే మరో వైపు దాటిన వారు వెంటనే పక్కకు వెళ్లకుండా ఆటోలు అడ్డుగా ఉంటున్నాయి. వీటిని నియంత్రించాల్సిన పోలీసులు అక్కడ కనిపించడం లేదు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ గడ్డిఅన్నారం చౌరస్తా వద్ద రోడ్డు దాటాలంటే పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.. కోణార్క్‌ చౌరస్తాలో సిగ్నల్‌ పడగానే వేగంగా దూసుకొచ్చే వాహనాలు ఓ వైపు ఉంటే మరో వైపు దాటిన వారు వెంటనే పక్కకు వెళ్లకుండా ఆటోలు అడ్డుగా ఉంటున్నాయి. వీటిని నియంత్రించాల్సిన పోలీసులు అక్కడ కనిపించడం లేదు.
2/18
అనంతపురం జిల్లా కేంద్రం నుంచి తాడిపత్రికి వెళ్లే రహదారిలో బుక్కరాయసముద్రం నుంచి శింగనమల చెరువు మలుపు వరకు సుమారు 12 కి.మీ. మేర రహదారి విభాగినిపై ఎత్తుగా పెరిగిన చెట్లు ఆహ్లాదాన్ని పంచాయి. అనంతపురం జిల్లా కేంద్రం నుంచి తాడిపత్రికి వెళ్లే రహదారిలో బుక్కరాయసముద్రం నుంచి శింగనమల చెరువు మలుపు వరకు సుమారు 12 కి.మీ. మేర రహదారి విభాగినిపై ఎత్తుగా పెరిగిన చెట్లు ఆహ్లాదాన్ని పంచాయి.
3/18
తంగేడు, ఆవాలు మొక్కల పువ్వులలా పసుపు వర్ణంతో ఆకర్షిస్తున్న ఈ పంట వాస్తవానికి జనుము. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలంలోని ఆవంచ గ్రామంలో సుమారు పది ఎకరాల్లో జనుము పంట సాగు చేశారు. అంతటా వరి పంట ఆకుపచ్చగా కనిపిస్తోంది. పొలాల్లో మాత్రం జనుము పూలతో పచ్చదనాల మాత కాళ్లకు పసుపు రాసుకుందా అన్నట్టు గోచరిస్తోంది. ఆవంచ నుంచి ఎల్లాపూర్‌ వెళ్లే మార్గంలో ప్రయాణిస్తున్న వారిని ఆకట్టుకుంటోంది. తంగేడు, ఆవాలు మొక్కల పువ్వులలా పసుపు వర్ణంతో ఆకర్షిస్తున్న ఈ పంట వాస్తవానికి జనుము. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మండలంలోని ఆవంచ గ్రామంలో సుమారు పది ఎకరాల్లో జనుము పంట సాగు చేశారు. అంతటా వరి పంట ఆకుపచ్చగా కనిపిస్తోంది. పొలాల్లో మాత్రం జనుము పూలతో పచ్చదనాల మాత కాళ్లకు పసుపు రాసుకుందా అన్నట్టు గోచరిస్తోంది. ఆవంచ నుంచి ఎల్లాపూర్‌ వెళ్లే మార్గంలో ప్రయాణిస్తున్న వారిని ఆకట్టుకుంటోంది.
4/18
  వేసవి కావడంతో పక్షులకు, జంతువులకు దాహార్తి తీర్చేందుకు  హైదరాబాద్‌లోనిభాగ్యనగర్‌ కాలనీలో దుకాణాల ముందు ఓ తొట్టిలో నీటిని ఉంచారు. మధ్యాహ్నం పూట జంతువులు దాహార్తిని తీర్చుకుంటున్నాయి 

5/18
  జాతీయ రహదారి కావడంతో ఎప్పుడు ఏ ఘటన జరిగినా సీసీ కెమెరాలు కీలకంగా వ్యవహరిస్తాయి. అయితే   హైదరాబాద్‌లోనికూకట్‌పల్లి భాగ్యనగర్‌ కాలనీ వద్ద మెట్రో పిల్లర్‌ కింద ఉన్న సీసీ కెమెరా స్తంభం ఒరగడంతో ఫుటేజి దొరకడం కష్టమే. ఉషముళ్ళపూడి కమాన్‌ వద్ద కూడా ఇదే పరిస్థితి.

6/18
   ఒకే బైకుపై ఇలా నలుగురు ప్రమాదకరంగా వెళ్తూ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి భాజపా కార్యాలయం వద్ద కనిపించారు. పరీక్ష రాసి క్షేమంగా ఇంటికి వెళ్లాల్సిన వీరికి ఏదైనా ప్రమాదం జరిగితే 4 కుటుంబాలు బాధపడాల్సి వస్తుంది. పిల్లలూ అర్థం చేసుకోండి

7/18
 గురువారం ఉదయం గంట సేపు కురిసిన వర్షానికి విజయవాడ నగరం తడిసిముద్దయింది. నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో వానలో తడుస్తూ వెళ్తున్న వాహన చోదకులు.

8/18
జీ20 సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా గురువారం విశాఖపట్నం నగర వాసులకు గాలిపటాల పోటీలు నిర్వహించారు. వివిధ రకాల పతంగులు వీక్షకులను అలరించాయి. 

9/18
  వరంగల్‌లోని హంటర్‌రోడ్‌ బొందివాగు వంతెన నుంచి 12 మోరీల కూడలి వరకు ప్రధాన రహదారి ఎత్తు పెంచేందుకు కంకర, డస్ట్‌ పోశారు.  పనులు ఆలస్యమవుతుండటంతో వారం, పది రోజులుగా దుమ్ము, ధూళితో స్థానిక వ్యాపారులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీ వాహనాల రాకతో పెద్ద ఎత్తున దుమ్ము లేస్తోంది. రహదారి పనులు తొందరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.

10/18
 వేసవికాలం వచ్చినా.. శీతాకాల వాతావరణం ఏర్పడుతోంది. గురువారం ఉదయం కమ్ముకున్న మంచు తెరలు యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని శ్వేతమయంగా మార్చాయి. కొండచుట్టూ, ఆలయ నగరి ప్రాంగణాలు మంచులో మెరిసిపోయాయి.

11/18
    ఆహ్లాదకర వనాలు, పూలతోటలు... చారిత్రక భవనాలు... భారీ వృక్షాలు.. ఇలా ప్రకృతి శోభితమైన  హైదరాబాద్‌లోనిబొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని చూసి సందర్శకులు పులకించిపోయారు. జ్ఞానగ్యాలరీ మ్యూజియం, భవనాల్లో గడిపారు. బుధవారం నుంచి సందర్శనకు ద్వారాలు తెరుచుకున్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో టికెట్లు  బుక్‌ చేసుకున్న 500 మంది వరకు  గురువారం నిలయాన్ని సందర్శించి కొత్త అనుభూతి పొందారు. 

12/18
     ఎన్నో రూ.లక్షలు వెచ్చించి నాటిన హరితహారం మొక్కలు మూగజీవాలకు ఆహారంగా  మారుతున్నాయి.  హైదరాబాద్‌లోనినెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజా వద్ద విభాగినిపై నాటిన మొక్కలకు సరైన రక్షణ ఏర్పాట్లు  లేకపోవడంతో మేకలు ఇలా మేస్తున్నాయి.

13/18
 ఎటు చూసినా ఆకాశ హర్మ్యాలు.. పైవంతెనలతో కనిపించే హైటెక్‌సిటీలో ట్రాఫిక్‌ వెతలు ఇంకా తీరలేదు. గురువారం సాయంత్రం  హైదరాబాద్‌లోనిమాదాపూర్‌ బయోడైవర్సిటీ నుంచి షేక్‌పేట వెళ్లే మార్గంలో కిలోమీటరు మేర భారీగా ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

14/18
  విద్యుత్తు కాంతులతో నిండిన ఈ ప్రాంతం హైటెక్‌సిటీ కాదు..  హైదరాబాద్‌లోనిఎల్బీనగర్‌ కూడలి.  ఒకప్పుడు నగరానికి తూర్పున.. నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతం అనేక బహుళ  అంతస్తులు, వ్యాపార సముదాయాలు,   కాలనీలు ఏర్పడడంతో కనుచూపు మేర వెలిగిపోతోంది.

15/18
 తొలగించిన కరెంటు స్తంభాన్ని వైర్లను జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఇలా ప్రమాదకరంగా తరలిస్తున్నారు. పొరపాటున చేయి జారితే వారితో పాటు పక్కన ప్రయాణించేవారికీ ప్రమాదకరమే..  హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ పైవంతెన వద్ద కనిపించిందీ చిత్రం.

16/18
   ఝార్ఘండ్‌లోని ధన్‌బాద్‌ విమానాశ్రయం సమీపంలో గురువారం శిక్షణ విమానం  ఓ ఇంటిగోడను ఢీకొట్టి కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్‌తోపాటు ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు.

17/18
  ముంబయిలో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ‘ద ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ లఘుచిత్రంలోని ప్రధాన పాత్రధారులు బొమ్మన్, బెల్లీలతో నిర్మాత గునీత్‌ మోంగా, దర్శకురాలు కార్తికి గోన్‌సాల్వేస్‌ల సంబరం

18/18
   వడగళ్ల వాన మామిడి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఓ మాదిరిగా పక్వానికి వచ్చి.. వానకు రాలిపోయిన మామిడికాయలను ఉగాది సందర్భంగా విక్రయించేందుకు ఓ రైతు నగర శివారులోని రామచంద్రాపురం రైతుబజార్‌కు తీసుకెళ్లారు. అయితే వాటిని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో ఇలా సమీపంలోని రోడ్డు పక్కన పడేశారు. వాటిలో ఓ మాదిరిగా ఉన్న మామిడికాయలను కొందరు ఏరుకొని తీసుకువెళ్లారు. 

మరిన్ని