News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 29 May 2022 20:30 IST
1/20
పారాలింపియన్‌ ప్రాచీ యాదవ్‌ కెనోయ్‌ స్ప్రింట్‌ విభాగంలో ప్రపంచకప్‌ పతకం సాధించిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు. పోలండ్‌లో జరిగిన 200 మీటర్ల పారా కెనోయ్‌ ప్రపంచ కప్‌ పోటీల్లో ఆమె కాంస్య పతకం సాధించారు. పారాలింపియన్‌ ప్రాచీ యాదవ్‌ కెనోయ్‌ స్ప్రింట్‌ విభాగంలో ప్రపంచకప్‌ పతకం సాధించిన తొలి వ్యక్తిగా చరిత్రకెక్కారు. పోలండ్‌లో జరిగిన 200 మీటర్ల పారా కెనోయ్‌ ప్రపంచ కప్‌ పోటీల్లో ఆమె కాంస్య పతకం సాధించారు.
2/20
3/20
4/20
అష్టావధాని మాడుగుల నాగఫణిశర్మ వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అలంకరించేందుకు వీలుగా రూ.5లక్షల విలువ చేసే 7.5కిలోల వెండి నాగఫణిని అధికారులకు అందజేశారు. అష్టావధాని మాడుగుల నాగఫణిశర్మ వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి అలంకరించేందుకు వీలుగా రూ.5లక్షల విలువ చేసే 7.5కిలోల వెండి నాగఫణిని అధికారులకు అందజేశారు.
5/20
ఇటీవల భారత ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌కుమార్‌ ఆదివారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు. ఇటీవల భారత ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌కుమార్‌ ఆదివారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు.
6/20
తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఆదివారం ఉదయం శ్రీవారిని ప్రార్థిస్తూ సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభించారు. దేశ ప్రజలు ఆయురాగ్యాలతో ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఆదివారం ఉదయం శ్రీవారిని ప్రార్థిస్తూ సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభించారు. దేశ ప్రజలు ఆయురాగ్యాలతో ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
7/20
8/20
నిజాంపేటలోని ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రి ఆధ్వర్యంలో పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ ‘నో టొబాకో’ పేరుతో 5కె రన్‌, సైక్లింగ్‌ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వివేకానంద్‌ ప్రారంభించగా.. పలువురు యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజాంపేటలోని ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రి ఆధ్వర్యంలో పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తూ ‘నో టొబాకో’ పేరుతో 5కె రన్‌, సైక్లింగ్‌ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వివేకానంద్‌ ప్రారంభించగా.. పలువురు యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
9/20
10/20
ప్రముఖ నటుడు సోనుసూద్‌ ఆదివారం ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొవిడ్‌ సమయంలో ప్రజలకు సేవలందించినందుకు నవీన్‌ పట్నాయక్‌ ఆయన్ను అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోనుసూద్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రజల కోసం మరింత సేవ చేసేలా నవీన్‌ పట్నాయక్‌ మాటలు తనలో స్ఫూర్తి నింపాయని తెలుపుతూ పోస్టు పెట్టారు. ప్రముఖ నటుడు సోనుసూద్‌ ఆదివారం ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొవిడ్‌ సమయంలో ప్రజలకు సేవలందించినందుకు నవీన్‌ పట్నాయక్‌ ఆయన్ను అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోనుసూద్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రజల కోసం మరింత సేవ చేసేలా నవీన్‌ పట్నాయక్‌ మాటలు తనలో స్ఫూర్తి నింపాయని తెలుపుతూ పోస్టు పెట్టారు.
11/20
12/20
నంద్యాలలో ఆదివారం నిర్వహించిన ‘సామాజిక న్యాయ భేరి’ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్‌ చేసిన మేలును వివరించారు. నంద్యాలలో ఆదివారం నిర్వహించిన ‘సామాజిక న్యాయ భేరి’ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్‌ చేసిన మేలును వివరించారు.
13/20
14/20
హైదరాబాద్‌లోని ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో నూతన ఐస్‌క్రీమ్‌ లాంచ్‌లో పలువురు మోడల్స్‌ పాల్గొన్నారు. ఐస్‌క్రీమ్‌లను రుచి చూడటంతో పాటు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో నూతన ఐస్‌క్రీమ్‌ లాంచ్‌లో పలువురు మోడల్స్‌ పాల్గొన్నారు. ఐస్‌క్రీమ్‌లను రుచి చూడటంతో పాటు ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
15/20
16/20
ప్రముఖ సినీనటుడు కమల్‌ హాసన్‌ మరో నటుడు రజనీకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరకాలమిత్రులైన వీరిద్దరు వివిధ అంశాలపై ముచ్చటించుకున్నారు. కమల్‌హాసన్‌ నటించిన ‘విక్రమ్‌’ సినిమా జూన్‌3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రజనీకాంత్‌.. కమల్‌హాసన్‌తో పాటు చిత్రబృందాన్ని తన నివాసానికి ఆహ్వానించి సినిమా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ సినీనటుడు కమల్‌ హాసన్‌ మరో నటుడు రజనీకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరకాలమిత్రులైన వీరిద్దరు వివిధ అంశాలపై ముచ్చటించుకున్నారు. కమల్‌హాసన్‌ నటించిన ‘విక్రమ్‌’ సినిమా జూన్‌3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రజనీకాంత్‌.. కమల్‌హాసన్‌తో పాటు చిత్రబృందాన్ని తన నివాసానికి ఆహ్వానించి సినిమా విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.
17/20
కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు. కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు.
18/20
19/20
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని క్యూలైన్లు నిండిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్లలో భక్తులు తితిదే ఆస్థాన మండపం వరకు వేచియున్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటలకు పైనే సమయం పడుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని క్యూలైన్లు నిండిపోయాయి. ప్రస్తుతం క్యూలైన్లలో భక్తులు తితిదే ఆస్థాన మండపం వరకు వేచియున్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటలకు పైనే సమయం పడుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
20/20

మరిన్ని