News In Pics: చిత్రం చెప్పే సంగతులు (04-12-2022)

Updated : 04 Dec 2022 14:15 IST
1/29
స్టూవర్ట్‌పురం దొంగగా పోలీస్‌ రికార్డులకెక్కిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా... అదే పేరుతోనే ఓ చిత్రం తెరకెక్కుతోంది. రవితేజ కథానాయకుడు. నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటి రేణు దేశాయ్‌ ‘హేమలత లావణ్యం’ అనే పాత్రలో నటిస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా సెట్లో కేక్‌ కట్‌ చేసి వేడుక చేసుకున్నారు. స్టూవర్ట్‌పురం దొంగగా పోలీస్‌ రికార్డులకెక్కిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా... అదే పేరుతోనే ఓ చిత్రం తెరకెక్కుతోంది. రవితేజ కథానాయకుడు. నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటి రేణు దేశాయ్‌ ‘హేమలత లావణ్యం’ అనే పాత్రలో నటిస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా సెట్లో కేక్‌ కట్‌ చేసి వేడుక చేసుకున్నారు.
2/29
ఏపీ పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఏపీ పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
3/29
భారత నేవీ డే వేడుకలు విశాఖతీరంలో ప్రారంభమయ్యాయి. సముద్ర తీరంలోని యుద్ధ స్తూపం వద్ద అమర జవాన్లకు తూర్పు నావికాదళం నివాళి అర్పించింది. అమరజవాన్ జ్యోతి ఎదుట తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా నివాళి అర్పించారు. భారత నేవీ డే వేడుకలు విశాఖతీరంలో ప్రారంభమయ్యాయి. సముద్ర తీరంలోని యుద్ధ స్తూపం వద్ద అమర జవాన్లకు తూర్పు నావికాదళం నివాళి అర్పించింది. అమరజవాన్ జ్యోతి ఎదుట తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా నివాళి అర్పించారు.
4/29
దేశ రాజధాని దిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సెలవు దినమైన నేడు దిల్లీ ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ రాజధాని దిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సెలవు దినమైన నేడు దిల్లీ ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
5/29
పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్‌ను డీవీవీ ఎంటర్‌టైనర్స్‌ విడుదల చేసింది. దీనికి సుజిత్‌ దర్శకుడు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఫ్యాన్స్‌ దీనిని షేర్‌ చేస్తూ తెగ ఆనందపడుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్‌ను డీవీవీ ఎంటర్‌టైనర్స్‌ విడుదల చేసింది. దీనికి సుజిత్‌ దర్శకుడు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఫ్యాన్స్‌ దీనిని షేర్‌ చేస్తూ తెగ ఆనందపడుతున్నారు.
6/29
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. మ్యూజిక్‌ కంపోజిషన్‌ పూర్తయినట్లు ప్రకటిస్తూ ఈ ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది. సంగీత దర్శకుడు తమన్ నేపథ్య సంగీత పనుల్లో నిమగ్నమైనట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు రానుంది. 
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. మ్యూజిక్‌ కంపోజిషన్‌ పూర్తయినట్లు ప్రకటిస్తూ ఈ ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది. సంగీత దర్శకుడు తమన్ నేపథ్య సంగీత పనుల్లో నిమగ్నమైనట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు రానుంది.
7/29
గూడెంలో డేరా ఇళ్లు 20 ఉంటాయి. సర్పంచిదీ టార్పాలిన్‌తో వేసుకున్న డేరా ఇల్లే.. కానీ ఒక్కో కుటుంబంలో పిల్లలు మాత్రం ఐదారుగురు నుంచి 11 మంది వరకున్నారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని ఏనెబావి శివారు పిట్టలోనిగూడేన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విస్మయం వ్యక్తం చేశారు. 

గూడెంలో డేరా ఇళ్లు 20 ఉంటాయి. సర్పంచిదీ టార్పాలిన్‌తో వేసుకున్న డేరా ఇల్లే.. కానీ ఒక్కో కుటుంబంలో పిల్లలు మాత్రం ఐదారుగురు నుంచి 11 మంది వరకున్నారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలోని ఏనెబావి శివారు పిట్టలోనిగూడేన్ని సందర్శించిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విస్మయం వ్యక్తం చేశారు.
8/29
రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చాక అనేక మంది కళాకారులు సందర్శిస్తూ మురిసిపోతున్నారు. బెంగాల్‌కు చెందిన దీపక్‌ఘోష్‌ అనే కళాకారుడు రామప్ప ఆలయాన్ని ప్రతిసృష్టించారు. కార్డు బోర్డుతో ఈ ఆలయాన్ని చిన్ని నమూనాలో అచ్చు గుద్దినట్టుగా తయారు చేశారు. 

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చాక అనేక మంది కళాకారులు సందర్శిస్తూ మురిసిపోతున్నారు. బెంగాల్‌కు చెందిన దీపక్‌ఘోష్‌ అనే కళాకారుడు రామప్ప ఆలయాన్ని ప్రతిసృష్టించారు. కార్డు బోర్డుతో ఈ ఆలయాన్ని చిన్ని నమూనాలో అచ్చు గుద్దినట్టుగా తయారు చేశారు.
9/29
నెల రోజులుగా వైభవంగా జరుగుతున్న శ్రీకురుమూర్తిస్వామి తిరునాళ్లకు యాత్రికులు భారీగా వస్తున్నారు. యాత్రికులు తాగి పడేసిన నీటి, మద్యం సీసాలను సేకరించి కొందరు జీవనోపాధి పొందుతున్నారు. ఇవన్నీ కలిపితే చిన్నపాటి కొండలా తయారైనా ఆశ్చర్యపోనక్కరలేదు. బతుకుదెరువు కోసం సేకరించినా ప్రకృతిపరంగా ఎంతో మేలు చేస్తున్నారు. నెల రోజులుగా వైభవంగా జరుగుతున్న శ్రీకురుమూర్తిస్వామి తిరునాళ్లకు యాత్రికులు భారీగా వస్తున్నారు. యాత్రికులు తాగి పడేసిన నీటి, మద్యం సీసాలను సేకరించి కొందరు జీవనోపాధి పొందుతున్నారు. ఇవన్నీ కలిపితే చిన్నపాటి కొండలా తయారైనా ఆశ్చర్యపోనక్కరలేదు. బతుకుదెరువు కోసం సేకరించినా ప్రకృతిపరంగా ఎంతో మేలు చేస్తున్నారు.
10/29
సీఆర్‌డీఏ అధికారులు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు వద్ద మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) వారి కోసం జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేశారు. చదరపు గజం రూ.17,499 ధరతో రెండు విభాగాల్లో 267 ప్లాట్లు విక్రయానికి పెట్టారు. ఇప్పుడది ముళ్ల చెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది. కనీసం హద్దు రాళ్లూ కనిపించని దుస్థితి నెలకొంది. సీఆర్‌డీఏ అధికారులు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవులూరు వద్ద మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) వారి కోసం జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ ఏర్పాటు చేశారు. చదరపు గజం రూ.17,499 ధరతో రెండు విభాగాల్లో 267 ప్లాట్లు విక్రయానికి పెట్టారు. ఇప్పుడది ముళ్ల చెట్లు పెరిగి అడవిని తలపిస్తోంది. కనీసం హద్దు రాళ్లూ కనిపించని దుస్థితి నెలకొంది.
11/29
సాధారణంగా బ్రహ్మకమలం పూలు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే పూస్తాయి. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడకు చెందిన లక్ష్మి ఇంటి వద్ద నాటిన మొక్క రెండు నెలలకు ఒకసారి చొప్పున పౌర్ణమికి ముందు రోజుల్లో పూస్తోంది. ఈసారి ఏకంగా 60 పూలు వికసించాయని లక్ష్మి తెలిపారు. సాధారణంగా బ్రహ్మకమలం పూలు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే పూస్తాయి. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం చౌడువాడకు చెందిన లక్ష్మి ఇంటి వద్ద నాటిన మొక్క రెండు నెలలకు ఒకసారి చొప్పున పౌర్ణమికి ముందు రోజుల్లో పూస్తోంది. ఈసారి ఏకంగా 60 పూలు వికసించాయని లక్ష్మి తెలిపారు.
12/29
విజయవాడ జక్కంపూడి కాలనీలో గత ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు ఇవి. డిసెంబర్‌ 21న సీఎం పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని టిడ్కో ఇళ్లన్నీ ప్రారంభించనుండటంతో అధికారులు భవనాలు సిద్ధం చేస్తున్నారు. మూడేళ్లుగా ఇక్కడ వసతులు కల్పించలేదు. కానీ.. భవనం ముందు వైపు వైకాపా జెండా రంగుల మాదిరిగా తెలుపు, నీలం రంగులు వేయిస్తున్నారు. వెనుక వైపు పాత రంగులే ఉంచారు. విజయవాడ జక్కంపూడి కాలనీలో గత ప్రభుత్వ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు ఇవి. డిసెంబర్‌ 21న సీఎం పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని టిడ్కో ఇళ్లన్నీ ప్రారంభించనుండటంతో అధికారులు భవనాలు సిద్ధం చేస్తున్నారు. మూడేళ్లుగా ఇక్కడ వసతులు కల్పించలేదు. కానీ.. భవనం ముందు వైపు వైకాపా జెండా రంగుల మాదిరిగా తెలుపు, నీలం రంగులు వేయిస్తున్నారు. వెనుక వైపు పాత రంగులే ఉంచారు.
13/29
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో హుద్‌హుద్‌ తుపాను సమయంలో ఓ వృక్షం వేర్లతో సహా నేల కొరిగింది. దానిని కొట్టేయకుండా అలాగే ఉంచడంతో ఉన్న వేర్ల ఆధారంతోనే ఇన్నాళ్లు పెరిగింది. ఆ బాటలో వెళ్లేవారు నీడ కోసం చెట్టు వద్దకు వచ్చి ఆగుతుంటారు. దగ్గరికి వెళ్తే కానీ అది పడిపోయి ఉందనే విషయం తెలియదు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో హుద్‌హుద్‌ తుపాను సమయంలో ఓ వృక్షం వేర్లతో సహా నేల కొరిగింది. దానిని కొట్టేయకుండా అలాగే ఉంచడంతో ఉన్న వేర్ల ఆధారంతోనే ఇన్నాళ్లు పెరిగింది. ఆ బాటలో వెళ్లేవారు నీడ కోసం చెట్టు వద్దకు వచ్చి ఆగుతుంటారు. దగ్గరికి వెళ్తే కానీ అది పడిపోయి ఉందనే విషయం తెలియదు.
14/29
సాధారణంగా ఒక కంద 4 కిలోల నుంచి 5 కిలోల వరకు పెరుగుతుంది. కృష్ణాజిల్లా అవనిగడ్డ నాలుగో వార్డుకు చెందిన కొండవీటి రామ్‌ ప్రసాద్‌ తోటలో ఓ దుంప 20 కిలోల వరకు ఊరింది. ఏడాది కిందట వేసిన తోటలో మిగతా మొక్కలు సాధారణంగానే దిగుబడి ఇచ్చాయి. ఒక్కటి మాత్రమే ఇలా భారీ దుంపను వేసింది. సాధారణంగా ఒక కంద 4 కిలోల నుంచి 5 కిలోల వరకు పెరుగుతుంది. కృష్ణాజిల్లా అవనిగడ్డ నాలుగో వార్డుకు చెందిన కొండవీటి రామ్‌ ప్రసాద్‌ తోటలో ఓ దుంప 20 కిలోల వరకు ఊరింది. ఏడాది కిందట వేసిన తోటలో మిగతా మొక్కలు సాధారణంగానే దిగుబడి ఇచ్చాయి. ఒక్కటి మాత్రమే ఇలా భారీ దుంపను వేసింది.
15/29
హైదరాబాద్‌ నగర శివారు తుర్కయాంజల్‌ పురపాలిక పరిధి కమ్మగూడ ఇందిరమ్మ కాలనీకి వెళ్లే దారిలో ఖర్జూర చెట్లు నాటుతున్నారు. 20 అడుగులు పెరిగిన ఈ చెట్లను ఒక్కోదానికి రూ.20 వేల చొప్పున వ్యయం చేసి చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. 

హైదరాబాద్‌ నగర శివారు తుర్కయాంజల్‌ పురపాలిక పరిధి కమ్మగూడ ఇందిరమ్మ కాలనీకి వెళ్లే దారిలో ఖర్జూర చెట్లు నాటుతున్నారు. 20 అడుగులు పెరిగిన ఈ చెట్లను ఒక్కోదానికి రూ.20 వేల చొప్పున వ్యయం చేసి చెన్నై నుంచి ప్రత్యేకంగా తెప్పించారు.
16/29
 మహారాష్ట్రలోని కరద్‌లో 740 మంది విద్యార్థులు భగవద్గీతను అత్యంత వేగంగా రాసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేందుకు దీన్ని నిర్వహించారు. మహారాష్ట్రలోని కరద్‌లో 740 మంది విద్యార్థులు భగవద్గీతను అత్యంత వేగంగా రాసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించేందుకు దీన్ని నిర్వహించారు.
17/29
 భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌గాంధీతోపాటు పాల్గొన్న దివ్యాంగులు భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌గాంధీతోపాటు పాల్గొన్న దివ్యాంగులు
18/29
దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను శనివారం హైదరాబాద్‌ బేగంపేటలో ప్రారంభించారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో కావాల్సిన బంగారాన్ని ఇందులో డ్రా చేసుకోవచ్చు. దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను శనివారం హైదరాబాద్‌ బేగంపేటలో ప్రారంభించారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో కావాల్సిన బంగారాన్ని ఇందులో డ్రా చేసుకోవచ్చు.
19/29
సిద్దిపేటలోని ప్రధాన ప్రాంతాల్లో చేతికందివచ్చినట్లుగా సూర్యబింబం నిత్యం కనువిందు చేస్తోంది. పట్టణంలోని వెంకటేశ్వరాలయం, కోమటిచెరువు, చారిత్రక కమాన్‌ ప్రాంతాలు.. ఎరుపు, కాషాయ వర్ణాలతో భాస్కరుడు ఆభరణంగా సాయంత్రం వేళ కొత్తదనాన్ని పంచుతుండగా పట్టణవాసులను ఆకట్టుకున్నాడు. సిద్దిపేటలోని ప్రధాన ప్రాంతాల్లో చేతికందివచ్చినట్లుగా సూర్యబింబం నిత్యం కనువిందు చేస్తోంది. పట్టణంలోని వెంకటేశ్వరాలయం, కోమటిచెరువు, చారిత్రక కమాన్‌ ప్రాంతాలు.. ఎరుపు, కాషాయ వర్ణాలతో భాస్కరుడు ఆభరణంగా సాయంత్రం వేళ కొత్తదనాన్ని పంచుతుండగా పట్టణవాసులను ఆకట్టుకున్నాడు.
20/29
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో జలవనరులు కళకళలాడుతున్నాయి. ప్రధానంగా వరి పంట అత్యధికంగా సాగు చేశారు. ధాన్యం చేతికి రావడంతో ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటుచేసి కొనుగోలు చేసింది. జోగిపేట మండలం డాకూర్‌ శివారులో ఓ మిల్లు నిర్వాహకులు ధాన్యం బస్తాలను ఇలా నిల్వ చేయగా.. సమీపంలోని చెరువు నీటితో తొణికిసలాడుతుండటం ఇట్టే ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో జలవనరులు కళకళలాడుతున్నాయి. ప్రధానంగా వరి పంట అత్యధికంగా సాగు చేశారు. ధాన్యం చేతికి రావడంతో ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటుచేసి కొనుగోలు చేసింది. జోగిపేట మండలం డాకూర్‌ శివారులో ఓ మిల్లు నిర్వాహకులు ధాన్యం బస్తాలను ఇలా నిల్వ చేయగా.. సమీపంలోని చెరువు నీటితో తొణికిసలాడుతుండటం ఇట్టే ఆకట్టుకుంటోంది.
21/29
పల్లె వాతావరణం ఉట్టిపడేలా నిర్మించిన గుడిసెలు, కాగితంతో, కర్రలతో, 3డీ మ్యాపింగ్‌తో, ప్రింట్‌మేకింగ్‌, అరుదైన బంజారా కళతో తయారు చేసిన కళాకృతులు చూపరులను విశేషంగా  ఆకట్టుకుంటున్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వర్సిటీలోని  ‘తరతరాల తెలుగుజాతి’ ప్రాంగణంలో ‘కళామేళా’ పేరిట చిత్ర, శిల్పశాఖకు చెందిన బీఎఫ్‌ఏ ప్రస్తుత, పూర్వ విద్యార్థులు ప్రాణం పోసిన కళాకృతులు ఆకర్షిస్తున్నాయి. పల్లె వాతావరణం ఉట్టిపడేలా నిర్మించిన గుడిసెలు, కాగితంతో, కర్రలతో, 3డీ మ్యాపింగ్‌తో, ప్రింట్‌మేకింగ్‌, అరుదైన బంజారా కళతో తయారు చేసిన కళాకృతులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వర్సిటీలోని ‘తరతరాల తెలుగుజాతి’ ప్రాంగణంలో ‘కళామేళా’ పేరిట చిత్ర, శిల్పశాఖకు చెందిన బీఎఫ్‌ఏ ప్రస్తుత, పూర్వ విద్యార్థులు ప్రాణం పోసిన కళాకృతులు ఆకర్షిస్తున్నాయి.
22/29
విజయవాడలో శనివారం సినీనటి హెబ్బా పటేల్‌ సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆమె అభిమానులతో కాసేపు ముచ్చటించారు. కెమెరాలకు ఇలా పోజిచ్చారు. విజయవాడలో శనివారం సినీనటి హెబ్బా పటేల్‌ సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన ఆమె అభిమానులతో కాసేపు ముచ్చటించారు. కెమెరాలకు ఇలా పోజిచ్చారు.
23/29
నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లె పంచాయతీ పరిధిలోని మాలకొండ పుణ్యక్షేత్రం, పరిసరాలు పచ్చటి చెట్లతో కనువిందు చేస్తున్నాయి. ఇక్కడ జ్వాలా లక్ష్మీనృసింహ స్వామి ఆలయం ఉండటంతో భక్తులు  ప్రతిశనివారం తరలివస్తున్నారు. ఆధ్యాత్మిక భావనతోపాటు ప్రకృతి ఒడిలో సేదతీరుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ, అటవీశాఖ అధికారులు చెట్లను కొట్టకుండా పర్యవేక్షిస్తున్నారు. నెల్లూరు జిల్లా వలేటివారిపాలెం మండలం అయ్యవారిపల్లె పంచాయతీ పరిధిలోని మాలకొండ పుణ్యక్షేత్రం, పరిసరాలు పచ్చటి చెట్లతో కనువిందు చేస్తున్నాయి. ఇక్కడ జ్వాలా లక్ష్మీనృసింహ స్వామి ఆలయం ఉండటంతో భక్తులు ప్రతిశనివారం తరలివస్తున్నారు. ఆధ్యాత్మిక భావనతోపాటు ప్రకృతి ఒడిలో సేదతీరుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ, అటవీశాఖ అధికారులు చెట్లను కొట్టకుండా పర్యవేక్షిస్తున్నారు.
24/29
ఏనుగు ట్రాలీపై నిల్చొని వెళుతోందేమిటా అనుకుంటున్నారా! ఇది నిజమైనది కాదండోయ్‌.. బొమ్మ. నెల్లూరు నుంచి బద్వేల్‌ వైపు వెళుతుండగా- నెల్లూరు- ముంబయి జాతీయ రహదారిపై మర్రిపాడు సమీపంలో ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. తొలుత అమ్మో అనుకున్నా.. బొమ్మని తెలిసి.. ఔరా అనుకున్నారు చూసిన ప్రజలు. ఏనుగు ట్రాలీపై నిల్చొని వెళుతోందేమిటా అనుకుంటున్నారా! ఇది నిజమైనది కాదండోయ్‌.. బొమ్మ. నెల్లూరు నుంచి బద్వేల్‌ వైపు వెళుతుండగా- నెల్లూరు- ముంబయి జాతీయ రహదారిపై మర్రిపాడు సమీపంలో ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది. తొలుత అమ్మో అనుకున్నా.. బొమ్మని తెలిసి.. ఔరా అనుకున్నారు చూసిన ప్రజలు.
25/29
ఆంధ్రాఊటీ అరకులోయలో కొత్త అందాలకు కొదవే లేదు. గలగలా పారే వాగు.. బండరాళ్ల మధ్య కూర్చొని ప్రకృతి రమణీయ దృశ్యాల ఆస్వాదన.. అక్కడి నుంచే సుందరంగా కనిపించే కొండల నడుమ సాగే రైలు ప్రయాణం సందర్శకులకు మర్చిపోలేని అనుభూతి మిగులుస్తాయి. ఆంధ్రాఊటీ అరకులోయలో కొత్త అందాలకు కొదవే లేదు. గలగలా పారే వాగు.. బండరాళ్ల మధ్య కూర్చొని ప్రకృతి రమణీయ దృశ్యాల ఆస్వాదన.. అక్కడి నుంచే సుందరంగా కనిపించే కొండల నడుమ సాగే రైలు ప్రయాణం సందర్శకులకు మర్చిపోలేని అనుభూతి మిగులుస్తాయి.
26/29
సముద్ర అలల మధ్య కెరటాల్లో కేరింతలు కొడుతూ సందడి చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు యువత.. సముద్రంలో గడుపుతున్న ఆనందాలను వీడియోలను తీసుకుంటూ మైమరచి అలల మధ్యలో కొట్టుకుపోతూ ప్రాణాలు విడుస్తున్నారు. దూసుకొస్తున్న కెరటాల మద్యలో నిలబడి ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో స్నానాలు చేస్తూ సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసుకుంటూ మైమరచిన యువత. సముద్ర అలల మధ్య కెరటాల్లో కేరింతలు కొడుతూ సందడి చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు యువత.. సముద్రంలో గడుపుతున్న ఆనందాలను వీడియోలను తీసుకుంటూ మైమరచి అలల మధ్యలో కొట్టుకుపోతూ ప్రాణాలు విడుస్తున్నారు. దూసుకొస్తున్న కెరటాల మద్యలో నిలబడి ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో స్నానాలు చేస్తూ సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసుకుంటూ మైమరచిన యువత.
27/29
విజయవాడ సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రాంగణంలో ‘ఈనాడు’ ఆటో ఎక్స్‌పో’ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను కలెక్టర్‌ ఢిల్లీరావు ప్రారంభించారు. వివిధ కంపెనీల అధునాతన మోడల్‌ కార్లు, ద్విచక్రవాహనాలు, విద్యుత్తు వాహనాలను తిలకించేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. విజయవాడ సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ప్రాంగణంలో ‘ఈనాడు’ ఆటో ఎక్స్‌పో’ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను కలెక్టర్‌ ఢిల్లీరావు ప్రారంభించారు. వివిధ కంపెనీల అధునాతన మోడల్‌ కార్లు, ద్విచక్రవాహనాలు, విద్యుత్తు వాహనాలను తిలకించేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు.
28/29
విశాఖ నగరంలోని ఓ దుకాణంలో విక్రయానికి ఉంచిన విదేశీ పక్షుల ‘హాయ్‌..హాలో.. బాగున్నారా..’ వంటి పలకరింపులు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. వాటిల్లో సౌత్‌ అమెరికాకు చెందిన మకావ్‌ పక్షి రూ.2 లక్షలకు, ఆఫ్రికాకు చెందిన గ్రే ప్యారెట్‌ను రూ.70 వేలకు విక్రయిస్తామని నిర్వాహకులు తెలిపారు. విశాఖ నగరంలోని ఓ దుకాణంలో విక్రయానికి ఉంచిన విదేశీ పక్షుల ‘హాయ్‌..హాలో.. బాగున్నారా..’ వంటి పలకరింపులు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. వాటిల్లో సౌత్‌ అమెరికాకు చెందిన మకావ్‌ పక్షి రూ.2 లక్షలకు, ఆఫ్రికాకు చెందిన గ్రే ప్యారెట్‌ను రూ.70 వేలకు విక్రయిస్తామని నిర్వాహకులు తెలిపారు.
29/29
 తిరుపతి జిల్లా నారాయణవనం పోలీసుస్టేషన్‌ ఎదురుగా జాతీయ రహదారి పక్కన పంట పొలంలోని నేల బావి వర్షాలకు నిండు కుండను తలపిస్తోంది. గతేడాది చివర్లో కురిసిన, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు పెరిగి నీరు ఉబికాయని రైతులు తెలిపారు. బోర్లలో నీరు సమృద్ధిగా ఉండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం పోలీసుస్టేషన్‌ ఎదురుగా జాతీయ రహదారి పక్కన పంట పొలంలోని నేల బావి వర్షాలకు నిండు కుండను తలపిస్తోంది. గతేడాది చివర్లో కురిసిన, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో భూగర్భ జలాలు పెరిగి నీరు ఉబికాయని రైతులు తెలిపారు. బోర్లలో నీరు సమృద్ధిగా ఉండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు