News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (02-06-2023)

Updated : 02 Jun 2023 06:11 IST
1/17
విశాఖపట్నం: కురుపాం కూడలి నుంచి అప్పుఘర్‌ వైపు సామగ్రితో వెళ్తున్న వాహనంలో ఓ వ్యక్తి ఇలా ప్రమాదకరంగా ప్రయాణించడంతో చూసిన వారు  హడలిపోయారు. విశాఖపట్నం: కురుపాం కూడలి నుంచి అప్పుఘర్‌ వైపు సామగ్రితో వెళ్తున్న వాహనంలో ఓ వ్యక్తి ఇలా ప్రమాదకరంగా ప్రయాణించడంతో చూసిన వారు హడలిపోయారు.
2/17
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు  సంగారెడ్డి  కలెక్టరేట్‌ ముస్తాబైంది. విద్యుత్తు దీప కాంతులతో కొత్త శోభను సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సంగారెడ్డి కలెక్టరేట్‌ ముస్తాబైంది. విద్యుత్తు దీప కాంతులతో కొత్త శోభను సంతరించుకుంది.
3/17
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు నల్గొండ జిల్లా కేంద్రం ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్తు దీపాలతో కలెక్టరేట్‌ను సుందరంగా అలంకరించారు.


రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు నల్గొండ జిల్లా కేంద్రం ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్తు దీపాలతో కలెక్టరేట్‌ను సుందరంగా అలంకరించారు.
4/17
తెలంగాణ  దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మువ్వన్నెల రంగుల  దీపాలతో అలంకరించిన మెదక్‌ ఖిల్లా 
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని మువ్వన్నెల రంగుల దీపాలతో అలంకరించిన మెదక్‌ ఖిల్లా
5/17
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యుద్దీపాల అలంకరణలో  వేడుకలకు ముస్తాబైన మహబూబ్‌నగర్‌ సమీకృత కార్యాలయ భవన సముదాయం తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యుద్దీపాల అలంకరణలో వేడుకలకు ముస్తాబైన మహబూబ్‌నగర్‌ సమీకృత కార్యాలయ భవన సముదాయం
6/17
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యుద్దీపాల  ప్రత్యేక అలంకరణలో వనపర్తి ఎస్పీ కార్యాలయం తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యుద్దీపాల ప్రత్యేక అలంకరణలో వనపర్తి ఎస్పీ కార్యాలయం
7/17
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యుద్దీపాల అలంకరణలో యాదాద్రి  కలెక్టరేట్‌
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యుద్దీపాల అలంకరణలో యాదాద్రి కలెక్టరేట్‌
8/17
తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యుద్దీపాల అలంకరణలో గోల్కొండ కోట, విద్యుత్‌ సౌధ,మెరిసిపోతున్న సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యుద్దీపాల అలంకరణలో గోల్కొండ కోట, విద్యుత్‌ సౌధ,మెరిసిపోతున్న సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌
9/17
 దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధ్యక్షుడు  జేపీ నడ్డాతో సమావేశమైన భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి.
దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి.
10/17
ఏపీలోనే పెద్ద కోనేరుగా చెప్పుకొనే గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ కల్యాణ పుష్కరిణి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈకోనేరు 450 ఏళ్ల నాటిది. అప్పట్లో 88 సెంట్ల విస్తీర్ణంలో శ్రీచక్ర ఆకారంలో నిర్మించారు. లోతు ఎంత ఉంటుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఏపీలోనే పెద్ద కోనేరుగా చెప్పుకొనే గుంటూరు జిల్లా మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ కల్యాణ పుష్కరిణి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈకోనేరు 450 ఏళ్ల నాటిది. అప్పట్లో 88 సెంట్ల విస్తీర్ణంలో శ్రీచక్ర ఆకారంలో నిర్మించారు. లోతు ఎంత ఉంటుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.
11/17
మహారాష్ట్రలో ‘డెక్కన్‌ క్వీన్‌’ ఎక్స్‌ప్రెస్‌ అనే రైలుకు అధికారులు, ప్రయాణికులు గురువారం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.  డెక్కన్‌ క్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌.. దేశంలోనే మొదటి సూపర్‌ ఫాస్ట్‌ రైలు. దీనిని 1930 జూన్‌ 1న ఆంగ్లేయులు ప్రారంభించారు. మహారాష్ట్రలో ‘డెక్కన్‌ క్వీన్‌’ ఎక్స్‌ప్రెస్‌ అనే రైలుకు అధికారులు, ప్రయాణికులు గురువారం పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. డెక్కన్‌ క్వీన్‌ ఎక్స్‌ప్రెస్‌.. దేశంలోనే మొదటి సూపర్‌ ఫాస్ట్‌ రైలు. దీనిని 1930 జూన్‌ 1న ఆంగ్లేయులు ప్రారంభించారు.
12/17
జోర్డాన్‌ యువరాజు హుస్సేన్, సౌదీలోని ప్రముఖ కుటుంబానికి చెందిన వారసురాలు రాజ్వా అల్‌సీఫ్‌ల వివాహం గురువారం జోర్డాన్‌ రాజధాని అమ్మన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. జోర్డాన్‌ యువరాజు హుస్సేన్, సౌదీలోని ప్రముఖ కుటుంబానికి చెందిన వారసురాలు రాజ్వా అల్‌సీఫ్‌ల వివాహం గురువారం జోర్డాన్‌ రాజధాని అమ్మన్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
13/17
పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో గురువారం రెజ్లర్లకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అనంతరం కాళీఘాట్‌లోని తన నివాసానికి ద్విచక్రవాహనంపై కూర్చుని ప్రయాణిస్తూ వెళుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో గురువారం రెజ్లర్లకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అనంతరం కాళీఘాట్‌లోని తన నివాసానికి ద్విచక్రవాహనంపై కూర్చుని ప్రయాణిస్తూ వెళుతున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
14/17
అమెరికాలోని యూటా రాష్ట్రం మొవాబ్‌లో ఎడారిలో సహజసిద్ధ రంగులను ఉపయోగించి ల్యాండ్‌స్కేప్‌ కళాకారుడు డేవిడ్‌ పోపా రూపొందించిన టైరనోసార్‌ చిత్రం అమెరికాలోని యూటా రాష్ట్రం మొవాబ్‌లో ఎడారిలో సహజసిద్ధ రంగులను ఉపయోగించి ల్యాండ్‌స్కేప్‌ కళాకారుడు డేవిడ్‌ పోపా రూపొందించిన టైరనోసార్‌ చిత్రం
15/17
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఆభరణాల తయారీ సంస్థ సోనియో.. కొత్త పార్లమెంట్‌ భవన ఆకృతిలో బంగారు చెవి రింగులు, ఉంగరాలను విక్రయిస్తోంది.వీటితోపాటు ప్రధాని మోదీ ఫొటోతో కూడిన డైమండ్‌ లాకెట్‌ను తయారు చేసి అమ్ముతోంది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఆభరణాల తయారీ సంస్థ సోనియో.. కొత్త పార్లమెంట్‌ భవన ఆకృతిలో బంగారు చెవి రింగులు, ఉంగరాలను విక్రయిస్తోంది.వీటితోపాటు ప్రధాని మోదీ ఫొటోతో కూడిన డైమండ్‌ లాకెట్‌ను తయారు చేసి అమ్ముతోంది.
16/17
 తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా త్రివర్ణ కాంతులతో వెలుగులీనుతున్న నాగార్జునసాగర్‌ డ్యాం 
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంగా త్రివర్ణ కాంతులతో వెలుగులీనుతున్న నాగార్జునసాగర్‌ డ్యాం
17/17
 ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే అధునాతన ఆలయం తెలంగాణలోని సిద్దిపేట శివారులో నిర్మితమవుతోంది. త్రీడీ ప్రింటింగ్‌.. రోబో సాయంతో పనులు చేపట్టడం ఇక్కడి ప్రత్యేకత. ఇది ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటింగ్‌ ఆలయమని కంపెనీ ఎండీ జీడిపల్లి హరికృష్ణ తెలిపారు.

ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే అధునాతన ఆలయం తెలంగాణలోని సిద్దిపేట శివారులో నిర్మితమవుతోంది. త్రీడీ ప్రింటింగ్‌.. రోబో సాయంతో పనులు చేపట్టడం ఇక్కడి ప్రత్యేకత. ఇది ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటింగ్‌ ఆలయమని కంపెనీ ఎండీ జీడిపల్లి హరికృష్ణ తెలిపారు.
Tags :

మరిన్ని