News in pics: చిత్రం చెప్పే సంగతులు-02(03-02-2023)

Updated : 03 Feb 2023 22:03 IST
1/25
యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం తిరు కల్యాణం నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. యాదాద్రి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం తిరు కల్యాణం నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
2/25
అవికా గోర్‌, సాయి రోనక్‌ జంటగా నటించిన చిత్రం ‘పాప్‌కార్న్‌’. మురళి గంధం దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం కాకినాడ ‘కైట్‌’ మహిళా కళాశాలకు వెళ్లింది. ఈ సందర్భంగా అవికా గోర్‌, సాయిరోనక్‌ విద్యార్థులతో ముచ్చటిస్తూ, సెల్పీలు తీసుకుంటూ సందడి చేశారు. ‘పాప్‌కార్న్‌’ ఈ నెల 10న ప్రేక్షకుల మందుకు రానుంది. అవికా గోర్‌, సాయి రోనక్‌ జంటగా నటించిన చిత్రం ‘పాప్‌కార్న్‌’. మురళి గంధం దర్శకత్వం వహించారు. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం కాకినాడ ‘కైట్‌’ మహిళా కళాశాలకు వెళ్లింది. ఈ సందర్భంగా అవికా గోర్‌, సాయిరోనక్‌ విద్యార్థులతో ముచ్చటిస్తూ, సెల్పీలు తీసుకుంటూ సందడి చేశారు. ‘పాప్‌కార్న్‌’ ఈ నెల 10న ప్రేక్షకుల మందుకు రానుంది.
3/25
సాయి రోనక్‌తో సెల్ఫీలు తీసుకుంటున్న విద్యార్థినులు సాయి రోనక్‌తో సెల్ఫీలు తీసుకుంటున్న విద్యార్థినులు
4/25
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర 100కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యాత్ర సాగుతున్న పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో లోకేశ్‌ డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర 100కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా యాత్ర సాగుతున్న పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యంలో లోకేశ్‌ డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.
5/25
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి రైవాడ జలాశయం సమీపంలో ఓ మర్రిచెట్టు పెరిగి గూడులా మారింది. పెరుగుతున్న ఊడలు తీసేయడంతో పైకప్పులా ఏర్పడి రైతులను ఎండ, వాన నుంచి కాపాడుతోంది. గుబురుగా పెరగడంతో చుక్క వర్షపు నీరు కింద పడటంలేదు. ఈ దారిలో వెళ్లే బాటసారులు సైతం ఇక్కడే సేద తీరుతుంటారు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి రైవాడ జలాశయం సమీపంలో ఓ మర్రిచెట్టు పెరిగి గూడులా మారింది. పెరుగుతున్న ఊడలు తీసేయడంతో పైకప్పులా ఏర్పడి రైతులను ఎండ, వాన నుంచి కాపాడుతోంది. గుబురుగా పెరగడంతో చుక్క వర్షపు నీరు కింద పడటంలేదు. ఈ దారిలో వెళ్లే బాటసారులు సైతం ఇక్కడే సేద తీరుతుంటారు.
6/25
దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా అభిలాష్‌ జోషి దర్శకత్వంలో ‘కింగ్‌ ఆఫ్‌ కోట‌’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఓనమ్‌ పండగ కానుకగా(ఆగస్టులో) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా అభిలాష్‌ జోషి దర్శకత్వంలో ‘కింగ్‌ ఆఫ్‌ కోట‌’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఓనమ్‌ పండగ కానుకగా(ఆగస్టులో) విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
7/25
మలేసియాలోని కౌలాలంపూర్‌ టవర్‌ నుంచి బేస్‌ జంపర్స్‌ ఇలా డైవ్‌ చేసి సాహసోపేత విన్యాసాలు చేశారు.. మలేసియాలోని కౌలాలంపూర్‌ టవర్‌ నుంచి బేస్‌ జంపర్స్‌ ఇలా డైవ్‌ చేసి సాహసోపేత విన్యాసాలు చేశారు..
8/25
గాలిలో తేలియాడుతున్న బేస్‌ జంపర్స్‌ గాలిలో తేలియాడుతున్న బేస్‌ జంపర్స్‌
9/25
హైదరాబాద్‌ చిక్కడ్‌పల్లిలోని న్యూఎరా కళాశాల వార్షికోత్సవాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌ చిక్కడ్‌పల్లిలోని న్యూఎరా కళాశాల వార్షికోత్సవాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
10/25
నృత్య ప్రదర్శన ఇస్తున్న న్యూఎరా కళాశాల విద్యార్థినులు నృత్య ప్రదర్శన ఇస్తున్న న్యూఎరా కళాశాల విద్యార్థినులు
11/25
ఆదిలాబాద్‌ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం రాత్రి నుంచి చలిగాలుల తీవ్రత పెరిగింది. శుక్రవారం ఉదయం పొగమంచు కురిసింది. చలిగాలుల తీవ్రతకు గిరిజన ప్రాంతాల్లో ప్రజలు వణికిపోయారు. మధ్యాహ్నం వరకు చలితీవ్రత కొనసాగింది. ఆదిలాబాద్‌ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం రాత్రి నుంచి చలిగాలుల తీవ్రత పెరిగింది. శుక్రవారం ఉదయం పొగమంచు కురిసింది. చలిగాలుల తీవ్రతకు గిరిజన ప్రాంతాల్లో ప్రజలు వణికిపోయారు. మధ్యాహ్నం వరకు చలితీవ్రత కొనసాగింది.
12/25
అమెరికన్‌ నటి, గాయని ‘కాట్‌ గ్రాహమ్‌’ లాస్‌ ఏంజెలెస్‌లో నిర్వహించిన బ్లాక్‌ మ్యూజిక్ కలెక్టివ్‌ కార్యక్రమానికి హాజరై ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. అమెరికన్‌ నటి, గాయని ‘కాట్‌ గ్రాహమ్‌’ లాస్‌ ఏంజెలెస్‌లో నిర్వహించిన బ్లాక్‌ మ్యూజిక్ కలెక్టివ్‌ కార్యక్రమానికి హాజరై ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
13/25
‘యువగళం’ పాదయాత్రలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొగిలి దేవాలయం సమీపంలోని క్యాంపు సైట్‌ వద్ద ‘సెల్ఫీ విత్‌ లోకేశ్‌’ నిర్వహించారు. ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చి ఆయనతో సెల్ఫీ దిగి సంబరపడ్డారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొగిలి దేవాలయం సమీపంలోని క్యాంపు సైట్‌ వద్ద ‘సెల్ఫీ విత్‌ లోకేశ్‌’ నిర్వహించారు. ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చి ఆయనతో సెల్ఫీ దిగి సంబరపడ్డారు.
14/25
నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండల కేంద్రంలో వైతెపా అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె ప్రజలను పలకరిస్తూ.. వారి బాగోగులను తెలుసుకుంటూ ముందుకు సాగారు. నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ మండల కేంద్రంలో వైతెపా అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె ప్రజలను పలకరిస్తూ.. వారి బాగోగులను తెలుసుకుంటూ ముందుకు సాగారు.
15/25
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా.. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా.. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. 14వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
16/25
బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో ఈ నెల 9న భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు కోహ్లీ, పుజారా, జడేజా గ్రౌండ్‌లో ప్రాక్టీసు చేస్తూ కనిపించారు. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్‌లో ఈ నెల 9న భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు కోహ్లీ, పుజారా, జడేజా గ్రౌండ్‌లో ప్రాక్టీసు చేస్తూ కనిపించారు.
17/25
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్‌ ఇలా అసెంబ్లీకి కలిసి వచ్చారు. అనంతరం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, సీఎం కేసీఆర్‌ ఇలా అసెంబ్లీకి కలిసి వచ్చారు. అనంతరం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు.
18/25
ఫిబ్రవరి 11న నెక్లెస్‌ రోడ్డులోని హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌లో ఫార్ములా-ఈ రేసులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కొన్ని ఎస్కార్ట్‌ వాహనాలు హైదరాబాద్‌ చేరుకున్నాయి. ఫిబ్రవరి 11న నెక్లెస్‌ రోడ్డులోని హైదరాబాద్‌ స్ట్రీట్‌ సర్క్యూట్‌లో ఫార్ములా-ఈ రేసులు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కొన్ని ఎస్కార్ట్‌ వాహనాలు హైదరాబాద్‌ చేరుకున్నాయి.
19/25
సీఎస్‌ఆర్‌(కార్పొరేట్ సామాజిక బాధ్యత)లో భాగంగా  హీరో మోటార్స్ యాజమాన్యం తిరుపతిలో 120 ద్విచక్రవాహనాలను పోలీసులకు వితరణగా అందజేసింది. కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, హీరో ఆటోమొబైల్స్ ఎండీ చక్రవర్తి చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. సీఎస్‌ఆర్‌(కార్పొరేట్ సామాజిక బాధ్యత)లో భాగంగా హీరో మోటార్స్ యాజమాన్యం తిరుపతిలో 120 ద్విచక్రవాహనాలను పోలీసులకు వితరణగా అందజేసింది. కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, హీరో ఆటోమొబైల్స్ ఎండీ చక్రవర్తి చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు.
20/25
యాదాద్రి భువనగిరిలోని పాతగుట్టలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాల్గో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తున్న యాదగిరీశుడు.. యాదాద్రి భువనగిరిలోని పాతగుట్టలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు నాల్గో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తున్న యాదగిరీశుడు..
21/25
ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతిపై తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో విశ్వనాథ్ చిత్రపటానికి పూలమాల వేసి  నివాళులు అర్పించారు. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్ మృతిపై తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో విశ్వనాథ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
22/25
అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌. అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌.
23/25
అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. దీంతో ఎప్పుడు ఉండే దాని కంటే మూడింతల బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు యంత్రాంగం. అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. దీంతో ఎప్పుడు ఉండే దాని కంటే మూడింతల బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు యంత్రాంగం.
24/25
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగి  గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం జరిగి గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
25/25
తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక ఆశీర్వచనం ఇచ్చారు. తెలంగాణ గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక ఆశీర్వచనం ఇచ్చారు.

మరిన్ని