హద్దులు గుర్తించాలని...

గ్రామాల్లో బొడ్రాయి ప్రతిష్ఠ చేస్తే... గ్రామస్థులంతా ఉండాలంటారు? పెళ్లయిన ఆడపిల్లలు కూడా...

Updated : 23 May 2019 00:10 IST

ధర్మసందేహం

గ్రామాల్లో బొడ్రాయి ప్రతిష్ఠ చేస్తే... గ్రామస్థులంతా ఉండాలంటారు? పెళ్లయిన ఆడపిల్లలు కూడా తప్పకుండా ఆరోజు గ్రామానికి రావాలంటారు.. ఎందుకు?

- భాస్కర్‌, హైదరాబాద్‌

 

గ్రామానికి గరిమనాభి లేదా కేంద్రం అయిన ప్రదేశంలో గ్రామదేవతకు ప్రతినిథిగా బొడ్రాయిని ప్రతిష్ఠించే ఆచారం ఉంది. ఆ విధమైన ప్రతిష్ఠ జరిగే రోజున ఆ గ్రామస్థులందరూ ఊళ్లోనే ఉండాలని, పెళ్లయి వేరేచోట్ల ఉంటున్న ఆడపడుచులు కూడా ఆనాడు స్థానికంగా ఉండాలనేది ఒక ఆచారంగా వస్తోంది. దీనికి కారణం.. బొడ్రాయిని ప్రతిష్ఠించటం అంటే ఊరి నడిబొడ్డును గుర్తించటం అన్నమాట. ఆ భౌగోళిక పరిజ్ఞానం, ఊరి నిర్మాణంపై ప్రజలకు అవగాహన కలగాలనేది ప్రధానమైన ఆంతర్యం. దీనిలో భాగంగానే ఆడపడుచులను సైతం ప్రతిష్ఠకు పిలుస్తారు. అంతేకాదు, ఊళ్లోని వారంతా కలుసుకుని ఐకమత్యంతో ఉండాలనీ, ఊరి బాగు కోసం అందరూ ఆలోచించాలనీ పెద్దల ఆశయం. ప్రతిష్ఠకే కాదు.. ఏటా ప్రతిష్ఠా వార్షికోత్సవం నిర్వహించడం కూడా సంప్రదాయంగా ఉంది.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని