భయం లేనిది...

భోగే రోగభయం, కులే చ్యుతిభయం, విత్తే నృపాలాద్భయమ్‌మానే దైన్యభయం, బలే రిపుభయం, రూపే జరాయాభయమ్‌...

Published : 23 Apr 2020 01:03 IST

మంచి మాట


భోగే రోగభయం, కులే చ్యుతిభయం, విత్తే నృపాలాద్భయమ్‌
మానే దైన్యభయం, బలే రిపుభయం, రూపే జరాయాభయమ్‌
శాస్త్రే వాదభయం, గుణే ఖలభయం, కాయే కృతాంతాద్భయమ్‌
సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం, వైరాగ్యమేవాభయమ్‌

భోగాలు అనుభవించే వాడికి రోగాలు వస్తాయనే భయం ఉంటుంది. ఉన్నత కులంలో పుట్టిన వాడికి వెలివేస్తారనే భయం, ధనవంతుడికి రాజభయం, పరువుగా బతికేవాడికి పరువు పోతుందన్న భయం, బలంగలవారికి శత్రువుల భయం, అందమైన వారికి ముసలితనమంటే భయం తప్పదు. పండితుడికి వాదంలో ఓడిపోతామనే భయం, మంచివారికి చెడ్డవారి వల్ల భయం, శరీరానికి మృత్యుభయం ఉంటాయి. వైరాగ్యం ఒక్కటే ఈ భూమిపై నిర్భయత్వాన్నిస్తుంది.

-భర్తృహరి
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు