పాలకుడు ఎలా ఉండాలంటే..!

రాజు ఎంత నిజాయతీపరుడైనా ఎప్పుడో ఒకప్పుడు ఒక తప్పయినా చేస్తాడు. అలా తప్పు చేసినవాడికి నరకం తప్పదు. అందుకే ‘రాజ్యాంతే నరకం ధ్రువం’ అన్నారు. మరి ఎలా

Published : 04 Jun 2020 00:14 IST

రాజు ఎంత నిజాయతీపరుడైనా ఎప్పుడో ఒకప్పుడు ఒక తప్పయినా చేస్తాడు. అలా తప్పు చేసినవాడికి నరకం తప్పదు. అందుకే ‘రాజ్యాంతే నరకం ధ్రువం’ అన్నారు. మరి ఎలా పరిపాలించాలి. తప్పు జరగకుండా పాలకుడు ఎలా ఉండాలి. దీనికి సమాధానం శ్రీరామచంద్రుడి పరిపాలన. ‘రామో రాజ్య ముపాసిత్వా’ అన్నాడు వాల్మీకి. మనం ఒక భగవంతుడి మంత్రాన్ని ఎంత పవిత్రంగా ఉపాసిస్తామో, జపిస్తామో శ్రీరాముడు తన రాజ్యాన్ని అంత పవిత్రంగా, చిత్తశుద్ధితో పరిపాలించాడు. అందుకే ఆయన పదకొండు వేల సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి సరాసరి పుణ్యలోకానికి వెళ్లిపోయాడని రామాయణం చెబుతోంది. ఈ సూత్రం ఎప్పటికీ ఆదర్శప్రాయం.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని