రుగ్వేదంలో ఒక నీతి

సూర్యుడికీ, సంజ్ఞాదేవికీ పుట్టిన కవల పిల్లలు యముడు, యమి. యుక్త వయసు వచ్చిన యమి సోదరుడైన యముణ్ణే ప్రేమించి, బిగి కౌగిలి కావాలంటూ అడిగింది.

Published : 09 Mar 2023 00:24 IST

సూర్యుడికీ, సంజ్ఞాదేవికీ పుట్టిన కవల పిల్లలు యముడు, యమి. యుక్త వయసు వచ్చిన యమి సోదరుడైన యముణ్ణే ప్రేమించి, బిగి కౌగిలి కావాలంటూ అడిగింది. సోదరీ సోదరుల మధ్య ఈ వాంఛ నీతివిరుద్ధమని యముడు ఆమె కోరికను తిరస్కరించాడు. ‘బ్రహ్మ మనిద్దరినీ మాతృ గర్భంలోనే ఒకటిగా ఉంచాడు. మనుషులకే ఇలాంటి నియమాలు కానీ దేవతలకు కాదు’ అని వాదించింది యమి. నయాన, భయాన లొంగదీసుకోవాలని చూసింది. వారి వాదన యమ యమి సంవాదంగా ప్రసిద్ధి పొందింది. యముడు మాత్రం ఆ అనైతిక కోరికను అంగీకరించక, సోదరిని తిరస్కరించాడు. నీతికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది యముడి ధర్మ నిష్ఠను తెలియజేయడమే కాదు పరోక్షంగా నీతిని ఉపదేశిస్తుంది. స్త్రీ పురుషులది పవిత్ర బంధమని, వావివరుసలు పాటించాలే గానీ అక్రమ సంబంధాలు కూడదని రుగ్వేదంలోని ఈ ఘట్టం తెలియజేస్తుంది. వేల సంవత్సరాల నాటి ఈ పవిత్ర గ్రంథాల్లో మనం అనుసరించాల్సిన పరమ సత్యాలున్నాయి.

శివలెంక ప్రసాదరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు