ఏంటి ఉపయోగం?

‘భగవాన్‌! ఈ ప్రపంచం శాశ్వతమా కాదా? మరణించిన తర్వాత పునర్జన్మ ఉంటుందా ఉండదా? మీరు ఈ విషయాల్లో మౌనం వహిస్తున్నారు. లేదంటే అవి అవసరం లేని విషయాలని చెబుతున్నారు’ అని బుద్ధుడిని ఓ వ్యక్తి గట్టిగా అడిగాడు. అందుకు తథాగతుడు ఇలా అన్నాడు. ‘లోకం శాశ్వతమా కాదా?

Updated : 22 Jul 2021 03:00 IST

‘భగవాన్‌! ఈ ప్రపంచం శాశ్వతమా కాదా? మరణించిన తర్వాత పునర్జన్మ ఉంటుందా ఉండదా? మీరు ఈ విషయాల్లో మౌనం వహిస్తున్నారు. లేదంటే అవి అవసరం లేని విషయాలని చెబుతున్నారు’ అని బుద్ధుడిని ఓ వ్యక్తి గట్టిగా అడిగాడు. అందుకు తథాగతుడు ఇలా అన్నాడు. ‘లోకం శాశ్వతమా కాదా? అని నీకు చెబుతానని నేనెప్పుడైనా అన్నానా? వాటి గురించి ఎందుకు అడుగుతావు? ఒక వ్యక్తికి విషపూరిత బాణం గుచ్చుకుంది. దాన్ని తీయాలని చూసిన వారితో... ఆ బాణం ఎవరు వేశారు? అది ఏ విషం? దాన్ని ఎవరు తయారుచేశారు? అని ప్రశ్నిస్తూ చివరికి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. అసలు లోకం శాశ్వతమైనా, కాకపోయినా బ్రహ్మచర్యం పాటించాల్సిందే! జనన మరణాలు ఉన్నాయి. దుఃఖం కూడా ఉంది. దాన్ని పోగొట్టుకునే మార్గం చెప్పాను. నువ్వు అడిగిన విషయాలు బ్రహ్మచర్యం, సత్ప్రవర్తన, పవిత్రత, ప్రశాంతత, ఆనందం, జ్ఞానం పొందేందుకు ఉపయోగపపడవు. అందుకే వాటిని అవసరంలేని విషయాలని అన్నాను. జీవితంలో దుఖం ఉంది. దాన్ని తప్పించుకోవాలి. నేను చెప్పిన ధర్మసూత్రాలను అవలంబించండి. మనోవాక్కాయ కర్మలతో పరిశుద్ధంగా జీవించండి. అప్పుడే జీవితానికి అర్థం, పరమార్థం’ అని చెప్పాడు బుద్ధుడు.

- శాలిని


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని