సంపద.. నాలుగు భాగాలు..

వారణాసి నగరాన్ని బ్రహ్మదత్తుడు పాలిస్తున్న కాలంలో బోధిసత్వుడు కర్షకుడిగా జన్మించాడు. అతనోరోజు పొలం దున్నుతుండగా నాగలికి ఏదో వస్తువు తగిలింది. తవ్వి చూస్తే నాలుగు మూరల పొడవున్న లోహస్తంభం

Updated : 23 Dec 2021 06:01 IST

వారణాసి నగరాన్ని బ్రహ్మదత్తుడు పాలిస్తున్న కాలంలో బోధిసత్వుడు కర్షకుడిగా జన్మించాడు. అతనోరోజు పొలం దున్నుతుండగా నాగలికి ఏదో వస్తువు తగిలింది. తవ్వి చూస్తే నాలుగు మూరల పొడవున్న లోహస్తంభం కనిపించింది. శుభ్రం చేయగా అది స్వర్ణమని అర్థమై సంతోషించాడు. సూర్యాస్తమయానికి ఇంటికెళ్తూ స్తంభాన్ని తీసుకెళ్దామని ఎత్తబోతే బోధిసత్వుడి శక్తి చాలలేదు. ఏం చేయాలో పాలుపోక దిగులుగా కూర్చున్నాడు. ఇంతలో ఒక ఆలోచన తట్టింది. ‘దీనిలో కొంత భాగం జీవన అవసరాలు తీర్చుకోవడానికి, కొంత రేపటిరోజు కోసం దాచుకోవడానికి, ఇంకొంత వ్యాపారం చేసేందుకు, మిగిలింది దానధర్మాలకు’ అనుకుని నాలుగుభాగాలు చేశాడు. ఇక బోధిసత్వుడికి భారం తగ్గి, మోయడం సులభమైంది. ఇది ధనాన్ని ఎలా ఖర్చుచేయాలో బోధపరిచే కథ.

- అమ్ముల మోహిత్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని