కరువు కాలంలో చక్రవర్తి ప్రతిజ్ఞ

ఖలీఫా ఉమర్‌ (రజి) ప్రజా క్షేమ సమాచారం తెలుసుకోవడానికి రాత్రిళ్లు మారువేషంలో గస్తీ తిరిగేవారు. అరబ్బులో ఖలీఫా అంటే చక్రవర్తి, దేవుని ప్రతినిధి అని అర్థం. ఓరోజు ఖలీఫా నేతిరొట్టె తింటుండగా మదీనా నుంచి

Updated : 13 Jan 2022 06:12 IST

ఖలీఫా ఉమర్‌ (రజి) ప్రజా క్షేమ సమాచారం తెలుసుకోవడానికి రాత్రిళ్లు మారువేషంలో గస్తీ తిరిగేవారు. అరబ్బులో ఖలీఫా అంటే చక్రవర్తి, దేవుని ప్రతినిధి అని అర్థం. ఓరోజు ఖలీఫా నేతిరొట్టె తింటుండగా మదీనా నుంచి ఒక బాటసారి వచ్చాడు. అతన్ని కూడా ఆహ్వానించగా, ఖలీఫా పక్కన కూర్చుని ఆబగా తింటున్నాడు. బాటసారి తినే పద్ధతి చూసి ఖలీఫా ‘అంత ఆకలిగా ఉందా?’ అనడంతో బాటసారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ‘ప్రభూ! మా ప్రాంతంలో కరువుకాటకాలు తీవ్రంగా ఉన్నాయి. అంతా ఆకలితో అల్లాడిపోతున్నారు. నెయ్యి తినక ఎంతకాలమైందో!’ అన్నాడు. ‘అయ్యో నా రాజ్య ప్రజలు ఇంతటి కరువులో బతుకుతున్నారా?’ అనుకుని బాధపడ్డారు ఖలీఫా. రాజ్యంలో కరువు తీరేవరకూ తాను నెయ్యి ముట్టనని ప్రతిజ్ఞబూనారు. ఖలీఫాల ఆదర్శ పాలన గురించి చెప్పేటప్పుడు ఉలమాలు ఈ గాథను గుర్తుచేస్తారు.

- తహూరా సిద్దీఖా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని