విష్ణు సహస్రనామావళి... సంక్షిప్తార్థాలు

విష్ణు సహస్రనామ స్తోత్రం పాపాల్ని హరిస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది- అని బహుళ ప్రచారంలో ఉంది. అలాంటి విశిష్ట నామావళి నుంచి ఒక్కో నామానికున్న సంక్షిప్త అర్థాన్ని ఇక్కడ ఇస్తున్నాం.

Updated : 09 Jun 2022 02:21 IST

వందే విష్ణుం!

విష్ణు సహస్రనామ స్తోత్రం పాపాల్ని హరిస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది- అని బహుళ ప్రచారంలో ఉంది. అలాంటి విశిష్ట నామావళి నుంచి ఒక్కో నామానికున్న సంక్షిప్త అర్థాన్ని ఇక్కడ ఇస్తున్నాం.

విశ్వంః

ఇది సహస్రనామాల్లో తొలి నామం. విశ్వం అంతా తానే అయిన వాడు అని దీనికి అర్థం. ఇంకా వివరంగా చూస్తే నామ రూపాత్మకమై, చిత్రాతి చిత్రమై, వికసించి, విస్తరించి, విరాజిల్లుతూ కనిపించే సకల చరాచర జడ చైతన్యమే విశ్వం. ఆ విశ్వమే ఈ స్వామి అని, సకల విషయాల్లో సంపూర్ణ మైనవాడు ఆ శ్రీహరి అని నిర్ధరించి చెప్పటమే ఈ నామం లక్ష్యం.

- తన్వి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని