మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే

అది మండువేసవి. జ్ఞానదేవుడు తనసోదరులైన నివృత్తిదేవుడు, నామదేవుడు, మరికొందరు సాధుజనులతో కలిసి యాత్రకు బయల్దేరాడు. దారిలో వారికి దాహమేసింది. దరిదాపుల్లో జలవనరులేమైనా కనిపిస్తాయేమోనని చుట్టూ పరికించి చూశారు. కొద్ది దూరంలో ఓ బావి కనిపించగా అక్కడికెళ్లారు.

Published : 28 Jul 2022 01:13 IST

అది మండువేసవి. జ్ఞానదేవుడు తనసోదరులైన నివృత్తిదేవుడు, నామదేవుడు, మరికొందరు సాధుజనులతో కలిసి యాత్రకు బయల్దేరాడు. దారిలో వారికి దాహమేసింది. దరిదాపుల్లో జలవనరులేమైనా కనిపిస్తాయేమోనని చుట్టూ పరికించి చూశారు. కొద్ది దూరంలో ఓ బావి కనిపించగా అక్కడికెళ్లారు.

నీళ్లు చాలా లోతున ఉన్నాయి. చేదుకోవడానికి ఏమీ లేదు. జ్ఞాన మార్గాన్ని అనుసరించే నివృత్తిదేవుడు తన యోగశక్తితో బావిలోని నీళ్లను కొంత మేరకు పైకి తెప్పించాడు. భక్తిమార్గాన్ని అనుసరించే నామదేవుడు వెంటనే భగవంతుణ్ణి స్తుతిస్తూ ఒక చక్కటి గీతాన్ని ఆలపించాడు. ఆ పారవశ్యానికి, అతడి గానమాధుర్యానికి ప్రకృతి పులకించిపోయింది. బావి లోంచి నీళ్లు ఒక్కసారిగా పొంగిపొర్లి పైవరకూ వచ్చాయి. అందరూ దాహం తీర్చుకున్నారు. భక్తి, జ్ఞానం వేర్వేరు మార్గాలైనా అవి చేర్చే గమ్యం ఒక్కటే అనే  నిజం జ్ఞానదేవుడికి సోదాహరణగా బోధపడింది. అందరూ కలిసికట్టుగా ఆనందంగా ముందుకు సాగిపోయారు.

 - శివరాజేశ్వరి 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని