ధ్యాస మళ్లించిన తోట

ప్రవక్త శిష్యుడొకరు మదీనాలో ఉన్న తన తోటలో నమాజు చేస్తుండగా ఆయన ధ్యాస పండ్లు, ఫలాల మీదికి మళ్లింది. దాంతో నమాజులో ఏకాగ్రత దెబ్బతినడానికి కారణమైన ఈ తోట తనకు ఉండకూడదనిపించింది.

Published : 18 Aug 2022 01:15 IST

ప్రవక్త శిష్యుడొకరు మదీనాలో ఉన్న తన తోటలో నమాజు చేస్తుండగా ఆయన ధ్యాస పండ్లు, ఫలాల మీదికి మళ్లింది. దాంతో నమాజులో ఏకాగ్రత దెబ్బతినడానికి కారణమైన ఈ తోట తనకు ఉండకూడదనిపించింది. వెంటనే ఖలీఫా హజ్రత్‌ ఉస్మాన్‌ దగ్గరికి వెళ్లి, ‘ఈ తోటను దైవానికి అంకితం చేస్తున్నాను’ అన్నారు. ఉస్మాన్‌ ఆ తోటను అమ్మగా వచ్చిన పైకాన్ని నిరుపేదలకు పంచిపెట్టారు. ప్రాపంచిక వ్యామోహం ఉంటే దైవ సన్నిధి అనుభూతికి రాదనడానికి ఇదొక ఉదాహరణ. ‘ప్రపంచ సుఖాలను ఆశించేవారు పరలోకాన్ని నష్టపోతారు. పరలోకాన్ని కోరుకునేవారు ప్రపంచాన్ని నష్ట పోతారు’ అన్నది ప్రవక్త ఉద్బోధ.

- తహూరా సిద్దీఖా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని