బొట్టు ఏ వేలితో పెట్టుకోవాలి?

మన చేతి వేళ్లలో ఒక్కో వేలు ఒక్కో గ్రహానికి నెలవు. నుదుటిపై కుంకుమ దిద్దేటప్పుడు ఉపయోగించే వేళ్లను బట్టి వాటి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది.

Published : 13 Oct 2022 00:31 IST

మన చేతి వేళ్లలో ఒక్కో వేలు ఒక్కో గ్రహానికి నెలవు. నుదుటిపై కుంకుమ దిద్దేటప్పుడు ఉపయోగించే వేళ్లను బట్టి వాటి ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. బొటనవేలు శుక్ర స్థానం. ఈ గ్రహం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఈ వేలితో తిలకం దిద్దుకుంటే ఆరోగ్యం, శక్తి కలుగుతాయి. మధ్యవేలు శని స్థానం. కనుక మధ్యవేలితో తిలకం ధరిస్తే దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుంది. ఉంగరపు వేలు సూర్య స్థానం. ఈ వేలితో బొట్టు పెట్టుకుంటే మనశ్శాంతి, తేజస్సు, శక్తి కలుగుతాయి. అంతేగాక ఆఙ్ఞాచక్రం ఉత్తేజితమై, మేధస్సును మేల్కొలుపుతుంది. దేవుడికి ఈ వేలితోనే తిలక ధారణ చేయాలనేది పురాణవచనం. చిటికెన వేలు బుధుని స్థానం. వాక్సంబంధిత వృత్తులకు బుధుడు కారకుడు. చిటికెన వేలితో తిలకం దిద్దుకుంటే బుద్ధికుశలత కలుగుతుంది. చూపుడు వేలు బృహస్పతి స్థానం. అమరత్వానికి చిహ్నం. మరణించినవారికే ఈ వేలితో తిలకం దిద్దుతారు. అందువల్ల వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ఇతర సందర్భాల్లో ఈ వేలితో బొట్టు పెట్టడాన్ని అశుభంగా భావిస్తారు.

- ఆదిత్య కార్తికేయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని