పోషకుడు పరమాత్ముడే!

సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీకి సైతం మార్గనిర్దేశం చేశాడు. శివాజీ సమనగఢ్‌ను నిర్మిస్తున్న సందర్భమది. వేలాదిమంది కూలీలు శ్రమిస్తున్నారు.

Published : 13 Oct 2022 00:32 IST

సమర్థ రామదాసు ఛత్రపతి శివాజీకి సైతం మార్గనిర్దేశం చేశాడు. శివాజీ సమనగఢ్‌ను నిర్మిస్తున్న సందర్భమది. వేలాదిమంది కూలీలు శ్రమిస్తున్నారు. వాళ్లను చూసిన ఛత్రపతి ‘ఇన్ని వేలమంది నా వల్లే బతుకుతున్నారు! నేను గనుక ఈ భారీ నిర్మాణం చేపట్టకపోతే వీళ్లంతా ఏమై పోయేవాళ్లో!’ అని కించిత్తు అహం భావానికి లోనయ్యాడు. ఆ పక్కనే ఉన్న సమర్థ రామదాసు తన మనోనేత్రంతో శివాజీ ఆభిజాత్యాన్ని అర్థం చేసుకున్నాడు. వెంటనే అక్కడ పనిచేస్తున్న ఒక కూలీ చేతిలోని రాతిని తీసుకుని, ఎదురుగా ఉన్న రాతిగోడపైకి విసిరాడు. అక్కడ గోడ పగిలి అందులోంచి ఓ కప్ప బయటకు దూకింది. ఆ దృశ్యాన్ని చూసిన శివాజీ స్థాణువైపోయాడు. ‘ఈ గోడలో చిక్కుకున్న కప్పను ఎవరు బతికిస్తున్నారు? సకల జీవులను పోషించేది పరమాత్మే కదా! ఆయన పోషణ ముందు నా పోషకత్వం ఎంత అల్పమైంది’ అని పశ్చాత్తాపం చెంది గురువుకు పాదాభివందనం చేశాడు.

- ప్రహ్లాద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని