Published : 03 Nov 2022 00:10 IST

గ్రహణం వేళ అల్లాహ్‌ స్మరణ

ముహమ్మద్‌ ప్రవక్త కాలంలో ఒకసారి సూర్య గ్రహణం నాడు పసివాడైన ప్రవక్త(స) కుమారుడు హజ్రత్‌ ఇబ్రాహీమ్‌ (రజి) చనిపోవడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇబ్రాహీమ్‌ మరణించినందునే గ్రహణం పట్టిందని చెప్పుకోసాగారు. అప్పుడు ప్రవక్త వాళ్లందరినీ సమీకరించి నమాజు చేశారు. బిగ్గరగా ఖురాన్‌ పఠించారు. నమాజు చేయడం పూర్తయ్యాక ‘సూర్యచంద్రులు దేవుడి చిహ్నాలు. ఒకరి మరణం వల్లగానీ జననం వల్లగానీ గ్రహణాలు సంభవించవు. ఇలాంటప్పుడు అల్లాహ్‌ స్మరణలో లీనమైపోవాలి. నమాజ్‌ చేయాలి. దానధర్మాలు ఇవ్వాలి. అంతే తప్ప మూఢ నమ్మకాలు వద్దు’ అంటూ చెప్పారు. 

- ముహమ్మద్‌ ముజాహిద్‌
ఇస్లాం సందేశం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని