సామాను మోసిన గవర్నర్‌!

పట్టణంలో సంత జరుగుతోంది. ఓ వ్యాపారి తన బండిలోంచి దింపిన సామాను మోసేందుకు కూలీ కోసం చూస్తున్నాడు. అటుగా వచ్చిన వ్యక్తితో కూలీ ఇస్తానంటూ తన సామానుమూటను అతడి నెత్తిమీద పెట్టాడు.

Updated : 15 Dec 2022 06:22 IST

పట్టణంలో సంత జరుగుతోంది. ఓ వ్యాపారి తన బండిలోంచి దింపిన సామాను మోసేందుకు కూలీ కోసం చూస్తున్నాడు. అటుగా వచ్చిన వ్యక్తితో కూలీ ఇస్తానంటూ తన సామానుమూటను అతడి నెత్తిమీద పెట్టాడు. అది చూసినవారు ‘అయ్యో మా గవర్నరుతో మూటలు మోయిస్తున్నారా?’ అంటూ కోప్పడ్డారు. వ్యాపారి హడలిపోయి ‘ఈయన గవర్నరని తెలియదు, మన్నించండి’ అంటూ ప్రాధేయపడ్డాడు. ‘మీ సామాను గమ్యానికి చేర్చేందుకు నేను తోడ్పడటంలో తప్పేముంది? మీరీ ప్రాంతానికి కొత్తవారు, మా అతిథులు. ఆ మాత్రం సాయం చేయడం ఖురాన్‌ బోధించిన ధర్మం’ అంటూ గవర్నర్‌ సల్మాన్‌ ఫార్శీ (రజి) వినమ్రంగా బదులిచ్చారు. ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు మారువేషంలో  తిరిగేవారాయన.
ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని