మత్తయి హితవు

ద్రోహచింతనతో దుర్మార్గంగా నడుచుకునేవారికి కీడు తప్పదు. అహంకారం, పట్టుదల, మొండితనం, గర్వం, ప్రలోభం.. లాంటివి జీవితాన్ని అంతం చేస్తాయి.

Updated : 15 Dec 2022 06:22 IST

ద్రోహచింతనతో దుర్మార్గంగా నడుచుకునేవారికి కీడు తప్పదు. అహంకారం, పట్టుదల, మొండితనం, గర్వం, ప్రలోభం.. లాంటివి జీవితాన్ని అంతం చేస్తాయి. తెలియక చేసిన తప్పును సరిదిద్దుకుని సరైన మార్గంలో నడిస్తే జీవితం కళకళలాడు తుందని దేవుడు తెలియజేస్తున్నాడు. అసహనం కలిగించే జీవితాన్ని త్యజించమని, అలాంటి బుద్ధి మార్చుకోమని హితవు పలుకుతున్నాడు. మత్తయి (మ్యాత్యు) సువార్త 3:10లో ‘చెట్టు వేరు మీద గొడ్డలి ఉంది. ఫలింపని ప్రతి చెట్టునూ నరికి అగ్నిలో వేయక తప్పదు’ అన్నాడు. ఇది ఒక హెచ్చరిక. జీవితం సరిదిద్దుకోవడానికి సమయం ఇస్తున్నాడు. అందుకు తగిన ఫలితాలను అందుకోమంటున్నాడు. అది మన చేతుల్లో, చేతల్లోనే ఉంది. తుది నిర్ణయం మనదే.
గుజ్జర్లమూడి కృపాచారి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని