భోగకాంక్ష మితిమీరితే..

బెస్తలు చేపలు పడుతున్నారు. ఇంతలో ఓ గద్ద ఒక చేపను నోట కరచుకుని వెళ్లింది. అది చూసిన కాకుల గుంపు చేప కోసం గద్దను చుట్టుముట్టాయి.

Published : 16 Mar 2023 00:40 IST

బెస్తలు చేపలు పడుతున్నారు. ఇంతలో ఓ గద్ద ఒక చేపను నోట కరచుకుని వెళ్లింది. అది చూసిన కాకుల గుంపు చేప కోసం గద్దను చుట్టుముట్టాయి. అది ఎటు వెళ్తే కాకులూ అటువైపే వెళ్లసాగాయి. వాటిని తప్పించుకునేందుకు చేస్తున్న విశ్వప్రయత్నంలో గరుడపక్షి నోటి నుంచి చేప జారిపోయింది. అంతే! కాకులన్నీ గద్దను వదిలేసి చేప పడిన చోటుకేసి దూసుకుపోయాయి. ఇక గద్ద ఓ చెట్టుపై నిశ్చింతగా కూర్చుని ‘ఈ చేపే కదా ఇంత గందరగోళానికి కారణమయ్యింది. ఇప్పుడు చేపా నా చెంత లేదు, చింతా నా చెంత లేదు’ అనుకుంది. మనిషి జీవితమూ అంతే! భోగాలనే చేపలను పట్టుకుని వేళ్లాడినంత కాలం.. కర్మలనే కాకులు కష్టాలనే రొదచేస్తూ వెంబడిస్తూనే ఉంటాయి. అప్పుడిక చింత, విచారం, అశాంతి కూడా వెన్నంటే వస్తాయి. కనుక మితిమీరిన కాంక్షతో భోగాల కోసం పరుగులు తీయకుండా పరిమిత వనరులతో ప్రశాంతంగా ఉండటం ఉత్తమం అని ప్రబోధిస్తూ రామకృష్ణ పరమహంస ఈ కథ చెప్పారు.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు