అదీ ప్రార్థన శక్తి
శత్రువును జయించడానికి ప్రార్థనను మించిన ఆయుధం లేదు. ప్రార్థన రూపంలో దేవుడు మన విన్నపాలను విని, తన చిత్తానుసారం అనుగ్రహి స్తాడు. స్వలాభం కోసమే కాకుండా ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు (యోబు 42:10) రెండింతలు ఆశీర్వదిస్తాడు.
శత్రువును జయించడానికి ప్రార్థనను మించిన ఆయుధం లేదు. ప్రార్థన రూపంలో దేవుడు మన విన్నపాలను విని, తన చిత్తానుసారం అనుగ్రహి స్తాడు. స్వలాభం కోసమే కాకుండా ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు (యోబు 42:10) రెండింతలు ఆశీర్వదిస్తాడు. లియోకార్డ్ రేవన్ హిల్ చెప్పినట్లు కనిపించని శత్రువుతో (సాతాను), అణగార్చే శక్తులతో పోరాటమే ప్రార్థన. ఇది మహా పదునైన ఆయుధం. ఉపవాస ప్రార్థన, ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన- మూడూ అభిలషణీయమే.
ప్రార్థనతో యెహోషువా అనే భక్తుడు ఆకాశంలో సూర్యచంద్రుల్ని కదలకుండా (యె.10:12) చేశాడు. హిజ్కియా ప్రార్థించగా యెహోవా తన దూతద్వారా లక్షా ఎనబై ఐదు వేలమంది శత్రువులైన అష్షురీయులను సంహరించాడు. సొబొమోను రాజు ప్రార్థన చేసి అపార జ్ఞానాన్ని పొందాడు. రాజైన నెబుకడ్నెజరు కలలోని భావాన్ని డానియేల్ ప్రార్థన వల్లనే వివరించగలిగాడు. కనుక ప్రార్థన ఇచ్చే దివ్య శక్తితో ప్రతిబంధకాల నుంచి విడుదలవుతాం. మోకాళ్లపై కూర్చుని దేవుడికి మొరపెట్టుకోవడం అత్యుత్తమ ప్రార్థన. క్రీస్తు రాత్రంతా కొండపై ప్రార్థన చేసి ఉదయం సువార్త పనిలో ఉండే వాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రార్థన ఆటంకాలన్నింటినీ తొలగించి అనుకూల పరిస్థితు లను ఏర్పరుస్తుంది.
మర్రి ఎ.బాబ్జి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TDP: రోజా ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందునే బుద్ధి చెప్పా: బండారు
-
Harsha Kumar: ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరు: హర్షకుమార్
-
Rohit Sharma: కెప్టెన్సీకి సరైన సమయమదే.. అనుకున్నట్లు ఏదీ జరగదు: రోహిత్ శర్మ
-
Arvind Kejriwal: 1000 సోదాలు చేసినా.. ఒక్క పైసా దొరకలేదు: అరవింద్ కేజ్రీవాల్
-
Pakistan: మా దేశం విడిచి వెళ్లిపోండి.. 17లక్షల మందికి పాకిస్థాన్ హుకుం!
-
Festival Sale: పండగ సేల్లో ఫోన్ కొంటున్నారా? మంచి ఫోన్ ఎలా ఎంచుకోవాలంటే..