మేఘాలు ఆదర్శం

పరులకు మేలు చేయడాన్ని పరోపకారం అంటారు. అలా చేసినవారికి పుణ్యఫలం దక్కుతుందని బుధజనులు చెబుతుంటారు. ఈ విషయాన్నే భర్తృహరి శ్లోకంలో..

Published : 08 Jun 2023 00:05 IST

పరులకు మేలు చేయడాన్ని పరోపకారం అంటారు. అలా చేసినవారికి పుణ్యఫలం దక్కుతుందని బుధజనులు చెబుతుంటారు. ఈ విషయాన్నే భర్తృహరి శ్లోకంలో..

పద్మాకరం దినకరో వికచం కరోతి
చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం
నభ్యర్థితో జలధరోపి జలం దదాతి
సస్తః స్వయం పరహితే విహితాభియోగాః

అంటూ చెప్పాడు. సూర్యుడు తనని ప్రార్థించకముందే కొలనులోని తామరలను వికసింపచేస్తాడు. చంద్రుడు తనని అభ్యర్థించకముందే కలువలను వికసింపచేస్తాడు. కోరకుండానే మేఘాలు వాటంతట అవే ప్రాణులకు నీరందిస్తాయి. అలాగే సజ్జనులు ఇతరులకు హితం చేసేందుకు సన్నద్ధులుగా ఉంటారు- అనేది భావం.
ఇక్కడ హితం, స్నేహితం గురించి కొంత చెప్పుకోవాలి. స్నేహితం ప్రయోజనాన్ని ఆశిస్తుంది. అలా ఆశించిన లాభం చేకూరకపోతే ఆ స్నేహం విచ్ఛిన్నమౌతుంది. కానీ హితం అలా కాదు. ఎదుటివారిలో మంచిని పెంచి చెడును నివారిస్తుంది. చెడును నివారించే సమయంలో ఎదురయ్యే అడ్డంకులను లెక్కచేయకుండా పరులకు మంచి చేకూర్చడమే హితం ముఖ్య ఉద్దేశం. సజ్జనులు దీనికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఒక్కరూ పరహితమే ఆశించాలన్నది జ్ఞానుల ఉపదేశం.

సాయి అనఘ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని