పిల్లలూ.. ప్రేమ

ఒకసారి ఓ పల్లెటూరి వ్యక్తి మహా ప్రవక్త (స) దర్బారులోకి వచ్చాడు. ఆ సమయంలో ప్రవక్త (స) తన మనవడు హసన్‌ (రజి)ని దగ్గర కూర్చోబెట్టుకుని ముద్దాడుతున్నారు.

Published : 08 Jun 2023 00:04 IST

ఒకసారి ఓ పల్లెటూరి వ్యక్తి మహా ప్రవక్త (స) దర్బారులోకి వచ్చాడు. ఆ సమయంలో ప్రవక్త (స) తన మనవడు హసన్‌ (రజి)ని దగ్గర కూర్చోబెట్టుకుని ముద్దాడుతున్నారు. ఇది పల్లె వాసికి ఎంతో వింతగానూ, పరువు ప్రతిష్ఠలకు విఘాతం కలిగించే విషయంగానూ తోచింది. ‘ఇదేంటీ.. తమరు పిల్లల్ని ముద్దాడుతున్నారా?! నాకు పదిమంది పిల్లలున్నారు. వారిలో ఏ ఒక్కరినీ నేను ఇంతవరకూ ముద్దాడలేదు’ అన్నాడతను. మహాప్రవక్త (స) ఆ వ్యక్తిని ఎగాదిగా చూసి, ‘కనికరించనివాడు కనికరానికి నోచుకోడు’ అన్నారు.

తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని