సలామ్‌ చేసేందుకు బజారుకు

హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) ఎదుటి వ్యక్తి తారసపడగానే సలామ్‌ చేయడంలో ముందుంటారు. ఒకసారి హజ్రత్‌ తుఫైల్‌ (రజి) ఆయన ఇంటికి వెళ్లారు.

Published : 15 Jun 2023 00:54 IST

హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ ఉమర్‌ (రజి) ఎదుటి వ్యక్తి తారసపడగానే సలామ్‌ చేయడంలో ముందుంటారు. ఒకసారి హజ్రత్‌ తుఫైల్‌ (రజి) ఆయన ఇంటికి వెళ్లారు. అప్పుడాయన ‘బజారుకు వెళ్దాం పదండి’ అన్నారు. అందుకు తుఫైల్‌ ‘అయ్యా! మీరు బజారుకు వచ్చి ఏం చేస్తారు? ఏ వస్తువూ కొనుగోలు చేయరు. పోనీ నలుగురితో కలిసి కూర్చుని కబుర్లు కూడా చెప్పరు. అంతదూరం నడిచి వెళ్లడం ఎందుకు, వృథా ప్రయాస. ఇంట్లోనే కూర్చుని సరదాగా మాట్లాడుకుందాం’ అన్నారు. అప్పుడాయన ‘తుఫైల్‌! మనం కేవలం సలామ్‌ చేసేందుకు బజారుకు వెళ్తున్నాం. ఎవరు ఎదురుపడినా సరే.. వారికి సలామ్‌ చేద్దాం’ అన్నారు. సలామ్‌ అంటే శాంతి. ముస్లిమ్‌లు పరస్పరం ఎదురైనప్పుడు ‘అస్సలామ్‌ అలైకుమ్‌’ అని అభివాదం చేయాలి. దానికి జవాబుగా ‘వ అలైకుమ్‌ అస్సలామ్‌’ అని పలకాలి. ఎదుటివారి శాంతి, శ్రేయస్సులను కోరుకోవడమే సలామ్‌ ఉద్దేశం. ముందుగా సలామ్‌ చేసేవారికి ఎక్కువ పుణ్యం దక్కుతుంది.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని