నైతికతకు పెద్దపీట

మహాప్రవక్త కాలంలో ఇద్దరు మహిళలు విరుద్ధ భావాలతో ఉండేవారు. ఒకామె రాత్రి నమాజులో లీనమై, పగలు ఉపవాస వ్రతాలు పాటించేది. విస్తృతంగా దాన  ధర్మాలు చేసేది.

Published : 06 Jul 2023 00:37 IST

హాప్రవక్త కాలంలో ఇద్దరు మహిళలు విరుద్ధ భావాలతో ఉండేవారు. ఒకామె రాత్రి నమాజులో లీనమై, పగలు ఉపవాస వ్రతాలు పాటించేది. విస్తృతంగా దాన  ధర్మాలు చేసేది. కానీ ఆమె తన నోటి దురుసు వల్ల ఇరుగు పొరుగు వారిని ప్రశాంతంగా బతకనిచ్చేది కాదు. రెండో మహిళ ఫర్జ్‌ నమాజులు చేసేది. తన వద్ద ధనం లేనందున ఉన్నంతలో పేదలకు ఆహారపానీయాలు పంచేది. ఎవరినీ నొప్పించేది కాదు. ఈ ఇద్దరి గురించి మహాప్రవక్త (స) ఎదుట ప్రస్తావించారొకరు. మొదటి మహిళ గురించి ‘ఆమెలో మంచి అనేది లేదు. తన దుష్ప్రవర్తనకుగాను ఆమెకు శిక్ష తప్పదు. రెండో మహిళ మట్టుకు స్వర్గంలో స్థానం సంపాదిస్తుంది’ అన్నారాయన.

ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని