వర్షం కోసం వేడుకున్న ప్రవక్త

దైవప్రవక్త (స.అ.సం) కాలంలో ఒకసారి దుర్భిక్షం ఏర్పడింది. శుక్రవారం నమాజు సందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా ఒక వ్యక్తి నిలబడి ‘అయ్యా! గుర్రాలు, మేకలు గ్రాసం లేక ఆకలితో చచ్చిపోయాయి.

Published : 13 Jul 2023 01:59 IST

దైవప్రవక్త (స.అ.సం) కాలంలో ఒకసారి దుర్భిక్షం ఏర్పడింది. శుక్రవారం నమాజు సందర్భంగా ఆయన ప్రసంగిస్తుండగా ఒక వ్యక్తి నిలబడి ‘అయ్యా! గుర్రాలు, మేకలు గ్రాసం లేక ఆకలితో చచ్చిపోయాయి. మాపై కరుణించి వర్షం కురిపించమని దైవాన్ని ప్రార్థించండి’ అన్నాడు. ప్రవక్త చేతులెత్తి ప్రార్థించారు.  మందిరం నుంచి బయల్దేరినవారంతా ఇళ్లకు చేరుకునేసరికి తడిసి ముద్దయ్యారు. వారం దాకా ఆ వర్షం నిరాఘాటంగా కురుస్తూనే ఉంది. మళ్లీ ఆ వ్యక్తే తర్వాతి శుక్రవారం ‘దైవప్రవక్తా! వర్షానికి మా ఇళ్లు దెబ్బతినేలా ఉన్నాయి. ఇక వాన వద్దని దైవాన్ని ప్రార్థించండి’ అని విన్నవించుకున్నాడు. అతని మాటలకు ప్రవక్త(స) చిరు మందహాసం చేసి, ‘దేవా! ఇప్పుడు మదీనా చుట్టుపక్కల వర్షం కురిపించు.. మాపై వద్దు’ అని వేడుకున్నారు.

ముహమ్మద్‌ ముజాహిద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని